Home న్యూస్ హానెస్ట్ టాక్….2023 సంక్రాంతి మూవీస్ ట్రైలర్స్ లో బెస్ట్ ఏది!

హానెస్ట్ టాక్….2023 సంక్రాంతి మూవీస్ ట్రైలర్స్ లో బెస్ట్ ఏది!

10

ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు రావానికి 3 స్ట్రైట్ మూవీస్ అలాగే 2 డబ్ మూవీస్ రిలీజ్ కానుండగా మెయిన్ పోటి మాత్రం 2 తెలుగు బిగ్ మూవీస్ అలాగే 2 డబ్ మూవీస్ మధ్యలో ఉంటుంది అని చెప్పాలి. అన్ని సినిమాల ట్రైలర్ లు రీసెంట్ గా ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ అవ్వగా ముందుగా తునివు ట్రైలర్ రిలీజ్ అయ్యి ఆల్ రెడీ వచ్చిన మనీ హేస్ట్ మరియు బీస్ట్ ల కాన్సెప్ట్ ను పోలి ఉండగా కొంచం ఎక్స్ పెరిమెంటల్ మూవీలానే కనిపిస్తుంది.

ఇక తర్వాత వచ్చిన వారసుడు ట్రైలర్ తమిళ్ వాళ్ళకి కొత్తగా అనిపించి ఉండొచ్చు కానీ తెలుగు వాళ్ళకి మాత్రం అనేక సినిమాల మిక్స్ లా అనిపించినా మినిమమ్ ఎలిమెంట్స్ ఉండే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా అనిపించింది… 

ఇక తర్వాత బాలయ్య వీర సింహా రెడ్డి ట్రైలర్ రిలీజ్ అవ్వగా సినిమా కథ ఆల్ మోస్ట్ బాలయ్య సింహా, లెజెండ్ అఖండ ఇలా రొటీన్ ఫార్మాట్ లోనే అనిపించింది, కానీ మరోసారి వర్కౌట్ అయ్యేలా కనిపిస్తుంది సినిమా. ఇక ఫైనల్ గా చిరు రవితేజల వాల్తేరు వీరయ్య ట్రైలర్…

రిలీజ్ అవ్వగా కథ ట్రైలర్ లో కొంచం రివీల్ చేసినా ఇద్దరు హీరోలు, ఫుల్ మాస్ స్టఫ్ తో పాటు మాస్ ఎలివేషన్ లు, కొంచం కామెడీ టచ్ ఇలా అన్ని మిక్స్ చేసిన ట్రైలర్ ఓవరాల్ కట్ కూడా బాగుండటంతో రిలీజ్ అయిన అన్ని ట్రైలర్స్ లో వాల్తేరు వీరయ్య బెటర్ అనిపించింది. తర్వాత ప్లేస్ లో వీర సింహా రెడ్డి తర్వాత వారసుడు మరియు చివరన తునివు అనిపించింది. మరి మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. 

10 COMMENTS

  1. Veera simha reddy debbaki migatha vaallaki boxlu pagilipothaayi.already entha nagetive gaa try chesina migtha vaalla ni lepali ani chusina adi sadyam kaadu Bros.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here