బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ ఇండియన్ మూవీస్ పరంగా కొన్ని సినిమాలు అంచనాలను మించి జోరు చూపించాయి, కొన్ని సినిమాలు సాలిడ్ హిట్ గా నిలిస్తే కొన్ని సినిమాలు ఫ్లాఫ్ అయ్యాయి… కానీ కొన్ని సినిమాలు బడ్జెట్ పరంగా ఏమాత్రం న్యాయం చేయలేక ఎపిక్ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుని దారుణంగా విఫలం అయ్యాయి…
ఓవరాల్ గా ఇప్పుడు ఇయర్ ఆల్ మోస్ట్ ఎండ్ అవ్వగా ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ లో బాలీవుడ్ సినిమాలే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కి ఎపిక్ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా ఈ ఇయర్ బిగ్గెస్ట్ లాస్ మూవీ ఏదైనా ఉంది అంటే కచ్చితంగా మాత్రం…
అక్షయ్ కుమార్(Akshay Kumar) ఇప్పుడు టైగర్ ష్రాఫ్(Tiger Shroff) కాంబోలో వచ్చిన బడే మియా చోటే మియా(Bade Miyan Chote Miyan) సినిమా అని చెప్పాలి…ఆల్ మోస్ట్ 350 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ లో…
ఇండియాలో 77 కోట్ల గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా 110 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది…షేర్ 55 కోట్ల లోపే ఉంటుంది అని అంచనా…ఓవరాల్ గా బడ్జెట్ ప్రకారం 300 కోట్ల లోపు లాస్ తో ఈ ఇయర్ లోనే కాదు ఇండియన్ హిస్టరీలో కూడా బడ్జెట్ పరంగా వన్ ఆఫ్ ది…
బిగ్గెస్ట్ ఫ్లాఫ్ గా నిలిచింది…ఇక టాలీవుడ్ విషయానికి వస్తే ఈ ఇయర్ ఇక్కడ డిసాస్టర్ లు పడ్డాయి కానీ డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆల్ మోస్ట్ 85 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కి 11 కోట్ల రేంజ్ లో షేర్ తో భారీ డిసాస్టర్ గా నష్టలాను సొంతం చేసుకుంది… కోలివుడ్ తరుపున…
సూర్య నటించిన కంగువ 250 కోట్ల రేంజ్ బడ్జెట్ తో 50 కోట్లు కూడా రికవరీ సరిగ్గా చేయలేక ఎపిక్ డిసాస్టర్ గా నిలిచింది… మొత్తం మీద ఈ ఇయర్ బాలీవుడ్ లో కొన్ని సినిమాలు మంచి విజయాలను నమోదు చేసినా కూడా ఓవరాల్ గా బిగ్గెస్ట్ ఫ్లాఫ్స్ తో మైండ్ బ్లాంక్ రిజల్ట్ లను సొంతం చేసుకున్నాయి…
ఇక మలయాళం నుండి మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ బరోజ్ కూడా 150 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కినట్లు సమాచారం…సినిమా ఆల్ టైం ఎపిక్ డిసాస్టర్ గా అక్కడ నిలిచే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు ఇప్పుడు…