బాక్స్ ఆఫీస్ దగ్గర 2024 ఇయర్ లో అద్బుతమైన స్టార్ట్ టాలీవుడ్ కి లభించిన తర్వాత ఫిబ్రవరి నుండి చూసుకుంటే మాత్రం వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నప్పటికీ కూడా ఆడియన్స్ ను అనుకున్న రేంజ్ లో థియేటర్స్ కి రప్పించే సినిమాలు అయితే కరవు అయ్యాయి అనే చెప్పాలి…
కొన్ని సినిమాలు పర్వాలేదు అనిపించేలా రిజల్ట్ లను సొంతం చేసుకున్నా కూడా అవేవి కూడా అనుకున్న రేంజ్ ను అయితే అందుకోలేదు…. ఇక సమ్మర్ లో రిలీజ్ అవ్వాల్సిన పెద్ద సినిమాలు కూడా ఎలక్షన్స్ కారణంగా పోస్ట్ పోన్ అవ్వడంతో ఇప్పుడు సమ్మర్ మొత్తం ఖాళీగా ఉండగా ఈ వీకెండ్ నుండి…
సమ్మర్ రేసులో నిలిచే సినిమాల రిలీజ్ లు మొదలు అవ్వబోతుంది….ఆశలు అన్నీ కూడా ఈ సినిమాల మీదే ఉందని చెప్పాలి ఇప్పుడు…. ముందుగా ఈ వీకెండ్ లో శ్రీవిష్ణు(Sree Vishnu) నటించిన కామెడీ ఎంటర్ టైనర్ ఓం భీమ్ బుష్(Om Bheem Bush Movie) రిలీజ్ కాబోతూ ఉండగా సినిమా మీద డీసెంట్ బజ్ ఉంది…
ఇక ఈ నెల లాస్ట్ వీకెండ్ లో క్రేజీ మూవీ సీక్వెల్ అయిన టిల్లు స్క్వేర్(Tillu Square Movie) రిలీజ్ కానుండగా ఫస్ట్ సమ్మర్ బిగ్గీగా ఈ సినిమాను చెప్పుకోవచ్చు….ఏమాత్రం టాక్ పార్ట్ 1 రేంజ్ లో ఉంటే సాలిడ్ కలెక్షన్స్ ని సినిమా అందుకునే అవకాశం ఉంది… ఇక ఏప్రిల్ మొదటి వారంలో….
యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటిస్తున్న ఫ్యామిలీ స్టార్(Family Star Movie) రిలీజ్ కానుండగా పెర్ఫెక్ట్ సమ్మర్ లో ఈ సారి ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో వస్తున్న విజయ్ దేవరకొండ టాప్ స్టార్స్ మూవీస్ ఏవి లేక పోవడంతో….ఫుల్ అడ్వాంటేజ్ తో బరిలోకి దిగబోతున్నాడు…
ఈ సినిమాకి ఏమాత్రం టాక్ పాజిటివ్ గా వచ్చినా సమ్మర్ లో భారీ హిట్ గా ఈ సినిమా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. సమ్మర్ లో ఇతర సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నా కానీ మేజర్ గా భారీ హిట్స్ అవ్వడానికి ప్రస్తుతానికి టిల్లు స్క్వేర్ మరియు ఫ్యామిలీ స్టార్ సినిమాలను అడ్వాంటేజ్ ఎక్కువగా ఉందని చెప్పొచ్చు.