Home న్యూస్ 50 కోట్ల సినిమా రజాకార్….వీకెండ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్!

50 కోట్ల సినిమా రజాకార్….వీకెండ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్!

0

లాస్ట్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో చిన్న సినిమానే అయినా కూడా బడ్జెట్ పరంగా పెద్ద సినిమా అయిన రజాకార్(Razakar Movie Collections)…..రీసెంట్ గా రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది…. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….

పర్వాలేదు అనిపించే రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. ఆల్ మోస్ట్ 50 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా వీకెండ్ లో ఉన్నంతలో ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూసుకుంటే ఆల్ మోస్ట్ 1.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకుందని చెప్పాలి…

వరల్డ్ వైడ్ గా 1.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ సినిమా కి సొంతం అవ్వగా వర్త్ షేర్ అటూ ఇటూగా 80 లక్షల రేంజ్ లో ఉంటుందని అంచనా…. మొత్తం మీద సినిమా కి ఇవి డీసెంట్ ఓపెనింగ్స్ అనే చెప్పాలి. సినిమా కి బిజినెస్ ఏమి జరగలేదు కానీ ఓన్ గానే రిలీజ్ అయిన సినిమా ఓవరాల్ గా…

బడ్జెట్ పరంగా చూసుకుంటే ఇంకా చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా స్టార్ కాస్ట్ ఏమి లేక పోయినా కూడా ఉన్నంతలో సినిమా మంచి జోరునే చూపిస్తుందని చెప్పాలి….ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ రేంజ్ 2 కోట్ల దాకా ఉంటుదని అంచనా… ఆ లెక్కన సినిమా ఇంకా జోరు చూపించాల్సిన అవసరం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here