Home న్యూస్ కేరళ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న RDX….20 కోట్లతో 70 కోట్ల ఊచకోత!

కేరళ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న RDX….20 కోట్లతో 70 కోట్ల ఊచకోత!

0

ప్రస్తుతం టాలీవుడ్ లో జవాన్, Miss శెట్టి Mr పొలిశెట్టి లు దుమ్ము లేపుతుంటే…టోటల్ ఇండియాలో జవాన్ మాస్ జాతర చేస్తుంది. కోలివుడ్ లో జైలర్ హవా తగ్గి ఇప్పుడు జవాన్ అక్కడ కూడా దుమ్ము లేపుతూ ఉండగా కేరళ ఇండస్ట్రీలో కూడా…

జవాన్ జాతర కొనసాగుతూ ఉండగా అక్కడ 2 వారాల క్రితం రిలీజ్ అయిన ఓ సినిమా రిమార్కబుల్ కలెక్షన్స్ తో దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కొత్త తో పోటిలో దిగి ఆ సినిమాను ఓడించి ఇప్పుడు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది…

ఆ సినిమానే RDX అనే యాక్షన్ మాస్ మూవీ…. పక్కా మాస్ యాక్షన్ సీన్స్ తో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ ఉండగా మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే కొంచం చిన్న మార్కెట్ ఉన్న ఏరియాగా భావించే మలయాళ ఇండస్ట్రీలో…

ఈ సినిమా ఏకంగా 20 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కగా సినిమా రిలీజ్ అయిన 16 రోజుల్లో కేరళలో 42 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ఓవర్సీస్ లో ఏకంగా 25 కోట్ల దాకా గ్రాస్ ను అందుకుని ఇప్పటి వరకు టోటల్ గా…

70 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతూ ఉండగా లాంగ్ రన్ లో 80 నుండి 85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు… పోటిలో ఉన్న సినిమాలను ఓడించి ఈ రేంజ్ లో వసూళ్ళని అక్కడ అందుకోవడం విశేషం అనే చెప్పాలి…త్వరలో ఈ సినిమా తెలుగు లో డబ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here