Home న్యూస్ 2 డేస్ జవాన్ టోటల్ కలెక్షన్స్…రెండో రోజు రికార్డుల ఊచకోత సామి!!

2 డేస్ జవాన్ టోటల్ కలెక్షన్స్…రెండో రోజు రికార్డుల ఊచకోత సామి!!

0

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) నటించిన జవాన్(Jawan Movie) సినిమా మొదటి రోజు సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోగా రెండో రోజు సినిమా మరోసారి అన్ని చోట్లా అద్బుతమైన హోల్డ్ ని చూపించిన సినిమా ఊచకోతని మరో లెవల్ లో…

చూపించి దుమ్ము దుమారం లేపగా ఓవర్సీస్ లో సినిమా రిలీజ్ రోజుకి మించి రెండో రోజు ఊహకందని లెవల్ లో జోరు చూపించగా తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా ఎక్స్ లెంట్ గా ట్రెండ్ అయ్యింది. ఏకంగా 6.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా…

హిందీలో రెండో రోజు 43.23 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంది. సినిమా రెండు రోజుల్లో హిందీ వర్షన్ ఏకంగా 111.73 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోగా మేజర్ గా రాష్ట్రాల వారి అలాగే 2 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…

Jawan 2 Days Total WW Collections Report
👉Telugu States- 15.80Cr~(All Inc)
👉Tamilnadu – 12.75Cr
👉Karnataka- 13.65Cr
👉Kerala – 5.25Cr
👉ROI – 106.90Cr~
👉Overseas – 84.80CR~***
Total WW Collections – 239.15CR GROSS

సినిమా 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 239 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుంది. సినిమా రెండో రోజు హోల్డ్ చేసిన రేంజ్ చూస్తుంటే మిగిలిన 2 రోజుల వీకెండ్ లో మరో లెవల్ లో ఊచకోత కోయడం ఖాయంగా కనిపిస్తూ ఉంది ఇప్పుడు. ఇక లాంగ్ వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుందో చూడాలి.

Jawan 2 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here