బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న సినిమా బలగం ఊహకందని కలెక్షన్స్ జోరుని చూపిస్తూ 20వ రోజు ఉగాది పండగ హాలిడే అడ్వాంటేజ్ తో అంచనాలను అన్నీ కూడా మించి పోయి సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఊచకోత కోసింది. సినిమా 19వ రోజుతో పోల్చితే 20వ రోజు ఏకంగా కోటకి పైగా కలెక్షన్స్ ని ఎక్కువగా సొంతం చేసుకోగా 20వ రోజు సినిమా ఒక్క నైజాం ఏరియాలోనే సాధించిన కలెక్షన్స్…
ఏకంగా 1.45 కోట్లకు పైగా ఉండటం సినిమా ఏ రేంజ్ లో ఊచకోత కోసింది అన్న దానికి నిదర్శనం. సినిమా 19వ రోజు 70 లక్షల గ్రాస్ ను అందుకుంటే 20వ రోజుకి వచ్చే సరికి సినిమా ఏకంగా 1.76 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది…
దాంతో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 20 రోజులు పూర్తీ అయ్యే టైంకి సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam – 14.41Cr
👉Andhra+Ceeded – 6.90Cr~
AP-TG Total:- 21.31CR(9.72CR~ Share)
👉KA+ROI+OS – 42L****
Total WW Collections – 21.73CR(9.92CR~ Share)
ఇదీ సినిమా 20 రోజుల్లో సాధించిన కలెక్షన్స్.
ఓవరాల్ గా 1.3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 8.62 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది, సినిమా నైజాంలో ఇప్పుడు లాంగ్ రన్ లో 20 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ఈ వీకెండ్ లో మరోసారి సినిమా మంచి కలెక్షన్స్ ని అందుకోవచ్చు.