మూడో వీకెండ్ లో మాస్ రచ్చ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా 19వ రోజు వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన సినిమా ఎక్స్ లెంట్ హోల్డ్ ని సొంతం చేసుకుని కుమ్మేసింది. ఇక 20వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర..
మరో వర్కింగ్ డే లో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించగా ఈవినింగ్ షోల నుండి క్రిస్టమస్ హాలిడే అడ్వాంటేజ్ తో గ్రోత్ ని చూపిస్తున్న సినిమా ఇప్పుడు 19వ రోజు కన్నా బెటర్ కలెక్షన్స్ ని 20వ రోజున సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతుంది ఇప్పుడు..
తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ డే 19 రేంజ్ లో హోల్డ్ ని చూపిస్తూ ఉండగా నైట్ షోలకి గ్రోత్ కూడా ఉన్న నేపధ్యంలో సినిమా ఇప్పుడు 1.3-1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది…
ఇక సినిమా కర్ణాటక, తమిళ్ లో కూడా డీసెంట్ హోల్డ్ ని చూపిస్తూ ఉండటంతో సినిమా 60-70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక హిందీలో సినిమా ఈ రోజు మంచి ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా 12-12.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని…
సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక ఓవర్సీస్ లో కూడా డీసెంట్ ట్రెండ్ ఉన్న నేపధ్యంలో వర్కింగ్ డే లో డ్రాప్ ఉండాల్సిన చోట సినిమా ఇప్పుడు 9.5-10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి…
ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకాస్త పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. మొత్తం మీద ఊరమాస్ హోల్డ్ ని ఈ రోజు చూపిస్తున్న నేపధ్యంలో సినిమా క్రిస్టమస్ హాలిడే రోజున మరింత రచ్చ లేపే అవకాశం ఉంది. ఇక టోటల్ గా సినిమా 20 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.