టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా మూడు వారాలను పూర్తీ చేసుకోవడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మూడో వారం వర్కింగ్ డేస్ లో స్లో అయిపోయినా కానీ మిగిలిన సినిమాలతో పోల్చితే ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా పరుగును కొనసాగిస్తుంది. సినిమా 20వ రోజు ఇప్పుడు మరో వర్కింగ్ డే టెస్ట్ లో ఎంటర్ అవ్వగా సినిమా మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర డ్రాప్స్ ను….
సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తుంది అని చెప్పాలి… ఆల్ మోస్ట్ 19వ రోజుతో పోల్చితే 20వ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 30-35% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఈ రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా….
26 లక్షల నుండి 30 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఒకవేళ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా మరో 3 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవచ్చు.
ఓవరాల్ గా మిగిలిన సినిమాలతో పోల్చితే ఇది బెటర్ కలెక్షన్స్ అనే చెప్పాలి. ఇక ఈ వీకెండ్ లో కొత్త సినిమాలు చాలానే రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండటంతో వాల్తేరు వీరయ్య ఎన్ని థియేటర్స్ ని హోల్డ్ చేస్తుంది, బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని ఇంకా సాధిస్తుంది అన్నది ఆసక్తి కరం.