బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వారాన్ని ముగించుకునే పనిలో ఉన్న ఆర్ ఆర్ ఆర్ మూవీ తెలుగు రాష్ట్రాలలో కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా రిలీజ్ వలన థియేటర్స్ ని మరింతగా కోల్పోవాల్సి వచ్చింది… అయినా కానీ హాలిడే అడ్వాంటేజ్ తో ఉన్నంతలో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకునే ఛాన్స్ ఉండగా 80 లక్షల నుండి 90 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ రావొచ్చు. ఇక హిందీ లో థియేటర్స్ ఈ రోజు చాలా వరకు తగ్గినా…
ఈ రోజు 2 కోట్ల నుండి 2.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ ఉండగా రెస్ట్ ఆఫ్ ఇండియా అలాగే ఓవర్సీస్ కలెక్షన్స్ తో కలుపుకుని మొత్తం మీద 21 వ రోజు మొత్తం మీద 2.2 కోట్ల నుండి 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం…
కనిపిస్తూ ఉండగా మొత్తం మీద ఈ రోజు సాధించే కలెక్షన్స్ 1050 కోట్ల మార్క్ ని క్రాస్ చేసి 1054 కోట్ల గ్రాస్ ను అందుకోబోతుంది… ఇక టోటల్ ప్రాఫిట్ లెక్క 120 కోట్లకు పైగా ఉండబోతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ ఈ వీకెండ్ లో ఉన్నంతలో మంచి షేర్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి… ఇక 3 వారాల టోటల్ కలెక్షన్స్ లెక్క ఎలా ఉంటుందో చూడాలి…