Home న్యూస్ 2nd డే బీస్ట్ కలెక్షన్స్…..120 కోట్ల భీభత్సం అక్కడా!!

2nd డే బీస్ట్ కలెక్షన్స్…..120 కోట్ల భీభత్సం అక్కడా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఓపెనింగ్స్ పరంగా కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ తో దుమ్ము దుమారం లేపిన బీస్ట్ మూవీ అనుకున్న దానికి మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, కానీ సినిమా కి మిక్సుడ్ టాక్ రావడం రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మమ్మోత్ కేజిఎఫ్ 2 సినిమా వరల్డ్ వైడ్ గా భారీ గా రిలీజ్ ను సొంతం చేసుకుని రిలీజ్ అవ్వడంతో బీస్ట్ సినిమా థియేటర్స్ తగ్గాయి…

దానికి తోడూ మిక్సుడ్ టాక్ కూడా ఉండటం తో రెండు తెలుగు రాష్ట్రాలలో డ్రాప్స్ 60-65% రేంజ్ లో ఉన్నాయి… ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై కూడా ఎఫెక్ట్ ఉండగా మొత్తం మీద ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో 1.5 కోట్ల నుండి 1.6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…

సినిమా తమిళనాడులో కూడా కేజిఎఫ్ నుండి భారీగా ఎఫెక్ట్ ఉండటంతో అక్కడ కూడా భారీగానే డ్రాప్ అయినా ఈ రోజు అక్కడ 20 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, ఇక కర్ణాటక, కేరళ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద….

6-7 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఇండియాలో రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 28 కోట్ల నుండి 30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ కలెక్షన్స్ తో సినిమా మొత్తం మీద రెండో రోజు 36 కోట్ల నుండి 38 కోట్ల రేంజ్  గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఇప్పుడు కనిపిస్తూ ఉందని చెప్పాలి.

ఈ కలెక్షన్స్ తో మొత్తం మీద 2 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్క 120 కోట్ల మార్క్ ని అధిగమించి 125 కోట్ల దాకా వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పాలి. ఓవరాల్ గా మిక్సుడ్ టాక్ ఉన్నా సెకెండ్ డే హాలిడే ఉండటం తమిళనాడులో సాలిడ్ హోల్డ్ చేయడం వలన సినిమా మంచి వసూళ్ళనే సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక 2 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here