Home న్యూస్ 23 కోట్లు పెడితే 15 రోజుల్లో వచ్చింది ఇది…పాపం!!

23 కోట్లు పెడితే 15 రోజుల్లో వచ్చింది ఇది…పాపం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర స్టార్ బ్యాగ్ డ్రాప్ ఉన్నా కానీ జనాలను థియేటర్స్ రప్పించాలి అంటే సినిమాలో కంటెంట్ క్లిక్ అయితేనే సాధ్యం అని చెప్పాలి. ఈ సంక్రాంతి కి ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాలు అన్నీ కూడా కంటెంట్ పరంగా ఆకట్టుకోక పోయినా ఉన్నంతలో పండగ సెలవులను బంగార్రాజు ఒక్కటి పర్వాలేదు అనిపించేలా ఎంజాయ్ అయితే చేసింది. ఇక మిగిలిన 2 సినిమాలు కూడా డెబ్యూ హీరోలను లాంచ్ చేస్తూ తెరకెక్కించిన సినిమాలు కాగా….

వీటిలో రౌడీ బాయ్స్ ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సాధించగా సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లాని హీరోగా పరిచయం చేస్తూ ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చిన హీరో మూవీ చాలా లిమిటెడ్ గా రిలీజ్ అవ్వడం అలాగే కంటెంట్ కూడా యావరేజ్ గానే…

ఉండటం లాంటివి పండగ వీకెండ్ లో తప్పితే తర్వాత సినిమాకి అస్సలు కలిసి రాలేదు, రెండో వారంలో థియేటర్స్ ని సగం తగ్గించేశారు. దాంతో కలెక్షన్స్ పై ఇంపాక్ట్ మరింత పడగా ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 15 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది…

👉Nizam: 75L
👉Ceeded: 36L
👉UA: 40L
👉East: 18L
👉West: 12L
👉Guntur: 15L
👉Krishna: 13L
👉Nellore: 10L
AP-TG Total:- 2.19CR(4.10CR~ Gross)
👉Ka+ROI: 0.10Cr
👉OS – 0.11Cr
Total WW: 2.40CR(4.60CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా 2 వారాలు పూర్తీ చేసుకున్న తర్వాత సాధించిన కలెక్షన్స్ లెక్క… చాలా చోట్ల కలెక్షన్స్ ని…

Hero 1st Week Total Collections!!

రిపోర్ట్ చేయకపోవడంతో ట్రేడ్ లెక్కల ప్రకారం అప్ డేట్ చేశాం. ఇక సినిమా కోసం పెట్టిన బడ్జెట్ 23 కోట్ల రేంజ్ లో ఉండగా థియేట్రికల్ బిజినెస్ వాల్యూ 5.5 కోట్ల దాకా ఉంటుందట. 6 కోట్ల రేంజ్ టార్గెట్ ని అందుకోవాల్సిన సినిమా ఇంకా 3.6 కోట్ల దూరంలో ఉండగా బడ్జెట్ వైజ్ చూసుకుంటే దిమ్మ తిరిగే మైండ్ బ్లాంక్ లాస్ ను ఇచ్చింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here