బాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన హృతిక్ రోషన్(Hrithik Roshan) వార్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత చేస్తున్న సినిమా ఫైటర్(Fighter Movie)…ఈ సినిమా మీద కొంత టైం క్రితం వరకు భారీ అంచనాలు ఉండేవి, ఎయిర్ ఫోర్స్ నేపధ్యంలో తెరకెక్కిన సినిమానే అయినా కానీ హృతిక్ అలాగే వార్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ ల…
క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అవ్వడంతో సాలిడ్ క్రేజ్ ఏర్పడినా తర్వాత సినిమా ట్రైలర్ లాంటివి రిలీజ్ అయిన తర్వాత అనుకున్న హైప్ ను ట్రైలర్ అందుకోలేదు, రొటీన్ గానే అనిపించిన ట్రైలర్ తర్వాత సినిమా మీద బజ్ అయితే కొద్దిగా తగ్గింది…ఆ ఇంపాక్ట్ ఇప్పుడు సినిమా బుకింగ్స్ పై…
క్లియర్ గా కనిపిస్తూ ఉండగా ఆల్ మోస్ట్ 240 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ ఆడియన్స్ ముందుకు ఈ రిపబ్లిక్ డే వీకెండ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా అడ్వాన్స్ బుకింగ్స్ ను ఆల్ రెడీ ఓపెన్ చేసినా కూడా ఇప్పటి వరకు జరిగిన ప్రీ బుకింగ్స్ రేంజ్ 7 కోట్ల లెవల్ లోనే ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం.
దాంతో మొదటి రోజు ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను బట్టి సినిమా 24-26 కోట్ల రేంజ్ లోనే ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. హృతిక్ ప్రీవియస్ మూవీ వార్ అప్పట్లో బాలీవుడ్ తరుపున బిగ్గెస్ట్ డే 1 కలెక్షన్స్ రికార్డు ను 50 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దక్కించుకోగా…
ఇప్పుడు ఫైటర్ మూవీ అందులో సగానికి అటూ ఇటూగా అనిపించే రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ సినిమా రిలీజ్ అయ్యి టాక్ మంచి పాజిటివ్ గా ఉంటే 30 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం ఉందని ఎక్స్ పెర్ట్ చేస్తున్నారట. ఓవరాల్ గా ప్రజెంట్ సినిమా బుకింగ్స్ చూసి బాలీవుడ్ వాళ్ళు కొంచం బయపడుతున్నా టాక్ బాగుంటే సినిమా పుంజుకుంటుంది అన్న ధీమాతో అయితే ఉన్నారని చెప్పొచ్చు.