Home న్యూస్ 24 గంటలు ఓవర్….హిట్3 టీసర్ ఆల్ టైం రికార్డుల జాతర!!

24 గంటలు ఓవర్….హిట్3 టీసర్ ఆల్ టైం రికార్డుల జాతర!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ బెస్ట్ ఫామ్ తో దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని, టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలలో ఎపిక్ ఫామ్ తో దుమ్ము లేపుతూ ఉండగా, లాస్ట్ ఇయర్ సరిపోదా శనివారంతో హిట్ కొట్టిన తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు హిట్ సిరీస్ లో భాగంగా వస్తున్న కొత్త సినిమా హిట్ 3 సర్కార్స్ లాఠీ(HIT 3 Teaser : Sarkaar’s Laathi) సినిమాతో….

మే 1 న రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా రీసెంట్ గా నాని పుట్టిన రోజు కానుకగా సినిమా అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేయగా…టీసర్ కి ఆడియన్స్ నుండి అనుకున్న రేంజ్ కి మించి ఊరమాస్ రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి ఇప్పుడు…

టీసర్ వైలేంట్ గా ఉంటుంది అని అందరికీ తెలిసినా కూడా నాని నుండి ఈ రేంజ్ లో వైలేంట్ బ్రూటల్ మాస్ స్టఫ్ ను అయితే ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయలేదు అనే చెప్పాలి….ఆ రేంజ్ లో టీసర్ అంచనాలను మించిపోగా యూట్యూబ్ లో ఊరమాస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది…

24 గంటల్లో సినిమా టీసర్ కి టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో ఎపిక్ వ్యూస్ రికార్డ్ ను సొంతం చేసుకోగా లైక్స్ పరంగా కూడా కుమ్మేసిన ఈ టీసర్ 24 గంటల్లో మీడియం రేంజ్ మూవీస్ ఆల్ టైం టాప్ 2 లైక్స్ మార్క్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయడం విశేషం…

మొత్తం మీద 24 గంటల్లో హిట్3 మూవీ టీసర్ 17.12 మిలియన్ వ్యూస్ మార్క్ ని సొంతం చేసుకుని రికార్డ్ కొట్టగా లైక్స్ పరంగా 24 గంటల్లో 353.3K లైక్స్ మార్క్ ని అందుకుని ఆల్ టైం టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకుంది. దాంతో పాటు మీడియం రేంజ్ హీరోల పరంగానే కాదు..

ఏకంగా టాలీవుడ్ టాప్ టీసర్ రికార్డుల విషయంలో కూడా ఓవరాల్ గా టాప్ 7 ప్లేస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయడం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద టీసర్ సినిమా మీద అంచనాలను ఓ రేంజ్ లో పెంచగా ఇక మే 1 న ఏ రేంజ్ లో సినిమా కుమ్మేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here