Home న్యూస్ 24 గంటలు ఓవర్…నాని ది ప్యారడైజ్ గ్లిమ్స్ రికార్డుల జాతర!!

24 గంటలు ఓవర్…నాని ది ప్యారడైజ్ గ్లిమ్స్ రికార్డుల జాతర!!

0

టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా సినిమా సినిమాకి ఎక్స్ పెరిమెంట్స్ ను చేస్తూ కెరీర్ బెస్ట్ ఫామ్ తో దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) ఇప్పుడు కెరీర్ లో చేసిన ఎక్స్ పెరిమెంట్స్ అన్నీ ఒకెత్తు అయితే ఇప్పుడు చేయబోతున్న ఎక్స్ పెరిమెంట్స్ మరో ఎత్తు అని చెప్పాలి… ప్రస్తుతం హిట్3 సినిమాతో కెరీర్ లోనే…

మొదటి సారిగా ఫుల్ వైలేంట్ రోల్ చేయబోతున్న నాని…ఆ సినిమా తర్వాత చేస్తున్న అప్ కమింగ్ మూవీ అయిన ది ప్యారడైజ్(TheParadise Glimpse) మూవీ అందరినీ ఓ రేంజ్ లో షాక్ కి గురి అయ్యేలా చేసింది..హిట్ 3 ని మించిన వైలేంట్ రోల్ లో నాని ఇందులో కంప్లీట్ గ..

రగ్గుడ్ కంటెంట్ ఓ రాబోతూ ఉండగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ గ్లిమ్స్ ను రిలీజ్ చేయగా….గ్లిమ్స్ కంటెంట్ ఆడియన్స్ ను ఓ రేంజ్ లో ఆశ్యర్యపరచగా…. 24 గంటల్లో ఓవరాల్ గా ఊరమాస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల పరంగా…

సంచలన రికార్డ్ ను వ్యూస్ పరంగా సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది… లైక్స్ పరంగా కొత్త రికార్డులు ఏమి నమోదు కాలేదు కానీ ఓవరాల్ గా 24 గంటల్లో వ్యూస్ పరంగా 17.14 మిలియన్ వ్యూస్ ని అందుకుని మీడియం రేంజ్ మూవీస్ లో రికార్డ్ ను అందుకోగా…

ఓవరాల్ గా ఆల్ టైం హైయెస్ట్ వ్యూస్ ను సొంతం చేసుకున్న టాలీవుడ్ గ్లిమ్స్ లలో ఆల్ టైం టాప్ 4 ప్లేస్ ను సొంతం చేసుకుంది. ఇక లైక్స్ పరంగా 24 గంటల్లో ఓవరాల్ గా 262.8K లైక్స్ మార్క్ ని సొంతం చేసుకుని బాగానే జోరు చూపించింది. మొత్తం మీద బాక్ టు బాక్…

నాని నటిస్తున్న కొత్త సినిమాలు అంచనాలను మరో లెవల్లో పెరిగేలా చేస్తూ ఉండగా….ఈ సినిమాలు అనుకున్న రేంజ్ లో రచ్చ చేస్తే కనుక నాని మార్కెట్ రేంజ్ మరో లెవల్ కి వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here