Home న్యూస్ సంక్రాంతి మూవీస్(18-01-2024) బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

సంక్రాంతి మూవీస్(18-01-2024) బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

2024 సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయిన సినిమాలు సాలిడ్ కలెక్షన్స్ తో మంచి రన్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉన్నాయి. ఒక్క సినిమా స్లో డౌన్ అయినా మిగిలిన సినిమాలు వేటి రేంజ్ లో అవి అన్ని చోట్లా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా నైజాంలో మాత్రం సినిమాలు కొంచం డ్రాప్స్ ను ఎక్కువగా…

సొంతం చేసుకున్నా కానీ ఆంధ్ర మరియు సీడెడ్ ఏరియాల్లో మాత్రం మంచి కలెక్షన్స్ లో కనిపిస్తుంది, ఉన్న సినిమాల్లో సైంధవ్(Saindhav Movie) మాత్రం చాలా వరకు స్లో డౌన్ అవ్వగా ఈ రోజు సినిమా ఉన్నంతలో 40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే కొంచం కలెక్షన్స్ పెరగవచ్చు.

ఇక 5వ రోజులో అడుగు పెట్టిన నాగార్జున(Nagarjuna) నా సామి రంగ(Naa Saami Ranga Movie) మరోసారి మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా నైజాంలో మాత్రం స్లో అవ్వగా వైజాగ్, ఈస్ట్ లాంటి ఏరియాల్లో మంచి జోరుని చూపిస్తూ ఉండగా ఈ రోజు సినిమా 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి.

ఇక మహేష్ బాబు(Mahesh Babu) నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur Kaaram Movie) నైజాంలో డ్రాప్ అయినా కూడా ఆంధ్ర అండ్ సీడెడ్ లో మంచి హోల్డ్ నే చూపిస్తుంది, ఈస్ట్, వెస్ట్ వైజాగ్ ఏరియాలు స్ట్రాంగ్ గానే హోల్డ్ ఉండగా ఓవరాల్ గా 7వ రోజు ఈ సినిమా 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది.

ఇక 7వ రోజులోనే అడుగు పెట్టిన హనుమాన్(HanuMan Movie) మరోసారి అన్ని చోట్లా జోరు చూపిస్తుండగా నైజాంలో మిగిలిన సినిమాలు డ్రాప్ అయినా ఈ సినిమా స్ట్రాంగ్ హోల్డ్ ని చూపిస్తుంది. మొత్తం మీద 7వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 3.5 కోట్ల రేంజ్ నుండి అన్ని చోట్లా లెక్కలు బాగుంటే 3.8 కోట్ల దాకా షేర్ ని అందుకోవచ్చు…

వరల్డ్ వైడ్ గా సినిమా 5-5.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ అంచనాలను మించితాయో లేక ఇదే రేంజ్ లో వసూళ్ళని సొంతం చేసుకుంటాయో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here