రికార్డ్ బ్రేకింగ్ బిజినెస్ మీద రికార్డ్ బ్రేకింగ్ ప్రాఫిట్స్ తో దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie), నాలుగో వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కుమ్మేస్తూ దూసుకు పోతుంది. సినిమా కి ఇప్పుడు వీకెండ్ శనివారం అడ్వాంటేజ్ కలిసి రావడంతో…
అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా జోరుని చూపెడుతూ దూసుకు పోతున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో మరోసారి మంచి రాంపెజ్ ను చూపెడుతూ ఉండగా ఆల్ మోస్ట్ డే 23 మీద 30% రేంజ్ లో టికెట్ సేల్స్ లో గ్రోత్ కనిపిస్తూ ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా ఇదే రేంజ్ లో ఉంటే…
సినిమా 24వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా ఇప్పుడు 1.3-1.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక సినిమా కర్ణాటక తమిళ్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా లో ఈ రోజున…
40-45 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా హిందీలో మరోసారి మాస్ డామినేషన్ ని చూపెడుతూ దూసుకు పోతున్న సినిమా 8.5-9 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.
ఓవర్సీస్ లో కూడా పర్వాలేదు అనిపిస్తున్న సినిమా 24వ రోజున వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 7.5 కోట్ల రేంజ్ నుండి అన్ని చోట్లా ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే 8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం మించి పోయే ఔట్ రైట్ ఛాన్స్ కూడా ఉంది. ఇక టోటల్ గా సినిమా 24 రోజుల్లో సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.