బాక్ టు బాక్ డిసాస్టర్ మూవీస్ తర్వాత ఎక్స్ లెంట్ కంబ్యాక్ ను సొంతం చేసుకున్న యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) మొదటి 10 రోజుల్లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ అండ్ అన్ సీజన్ ఇంపాక్ట్ వలన స్లో డౌన్ అయినా కూడా…
ఉన్నంతలో మంచి లాంగ్ రన్ నే సొంతం చేసుకుని నాలుగో వీక్ లో కూడా లిమిటెడ్ థియేటర్స్ లో పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ ను చూపెడుతూ లాభాలను పెంచుకుంటూ ఉండగా…. సినిమా 23వ రోజున శనివారం అడ్వాంటేజ్ తో పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ ను చూపించగా…
ఇక 24వ రోజున సినిమాకి సండే అడ్వాంటేజ్ వలన మరికొంత జోరుని చూపెడుతూ ఉండగా…సినిమా కి ఓవరాల్ గా ఇది లాస్ట్ బెస్ట్ డే అని చెప్పాలి బాక్స్ ఆఫీస్ దగ్గర…. ఓవరాల్ గా సినిమా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే 24వ రోజున తెలుగు రాష్ట్రాల్లో…
16-18 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే సినిమా కలెక్షన్స్ కొద్ది వరకు పెరిగే అవకాశం ఉంది, ఈ రోజు మ్యాచ్ ఇంపాక్ట్ ఆఫ్ లైన్ లెక్కల పై పెద్దగా లేకుండా ఉంటే సినిమా మొత్తం మీద ఇప్పుడు..
20 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా, తెలుగు రాష్ట్రాల ఆవల షేర్ పెద్దగా వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇక సినిమా మొత్తం మీద లాస్ట్ బిగ్ డే అయిన 24 వ రోజున ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి ఇక….