కింగ్ నాగార్జున యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ బంగార్రాజు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ సెన్సేషన్ ని క్రియేట్ చేయడానికి సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. సోగ్గాడే చిన్ని నాయన సినిమా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత ఆల్ మోస్ట్ 5 ఏళ్ళకి వస్తున్న ఈ సీక్వెల్ పై అంచనాలు భారీ గానే ఉండగా ఈ సంక్రాంతికి పోటిలో పాన్ ఇండియా మూవీస్ భారీగా రిలీజ్ ముందుగా అనుకున్నా….
సడెన్ గా 3rd వేవ్ స్టార్ట్ అవ్వడంతో సినిమాలు అన్నీ కూడా పోస్ట్ పోన్ అవ్వగా ఇప్పుడు సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలో క్రేజ్ ఉన్న సినిమా ఇదొక్కటే అవ్వడంతో ట్రేడ్ లో సినిమా పై మంచి బజ్ నెలకొంది. వచ్చే వారానికి పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న…
విషయాలు ఇంకా తెలియాల్సి ఉండగా సినిమా పై బజ్ మాత్రం సాలిడ్ గా ఉండటం బిజినెస్ రెట్టించిన జోరుతో కొనసాగుతుంది. సినిమా ముందు తెలుగు రాష్ట్రాలలో 22 కోట్ల నుండి 25 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగేది కానీ ఇప్పుడు వస్తున్న ఆఫర్స్ అన్ని ఏరియాలలో కూడా 20% పైగానే వస్తూ ఉండగా…
అన్ని ఏరియాల్లో ఇప్పుడు సినిమా కి వస్తున్న ఆఫర్స్ ని చూస్తుంటే ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా ఇప్పుడు 30 కోట్లకు పైగానే మినిమమ్ బిజినెస్ చేసే అవకాశాలు ఎంతైనా ఉన్నాయని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ బిజినెస్ లెక్క ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో 35 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం కూడా ఉండగా ఇవన్నీ ఇప్పటి వరకు వచ్చిన ఆఫర్స్ మాత్రమే కాగా…
వచ్చే వారం వరకు పరిస్థితులు బాగుంటే ఈ లెక్క ఇంకా మించి ఫైనల్ బిజినెస్ లెక్క ఇంకా ఎక్కువ వరకు వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా ఈ బిజినెస్ ఇటు నాగార్జున కెరీర్ లో అటు నాగ చైతన్య కెరీర్ లో హైయెస్ట్ బిజినెస్ అనే చెప్పాలి. మరి ఫైనల్ గా సినిమా ఎంత బిజినెస్ ను చేస్తుందో చూడాలి ఇక….