ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊరమాస్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు నాలుగు వారాలను ఎక్స్ లెంట్ హోల్డ్ తో కంప్లీట్ చేసుకోవడానికి సిద్ధం అవుతుంది. సినిమా 26వ రోజున కొంచం ఎక్కువగా డ్రాప్ అయినా కూడా..
తిరిగి 27వ రోజున మంచి ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతుంది. అన్ని చోట్లా సినిమా బుకింగ్స్ నిన్నటి మీద బెటర్ గా ఉండటం విశేషం అని చెప్పాలి. దాంతో కలెక్షన్స్ పరంగా కూడా మంచి ట్రెండ్ ను చూపిస్తున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా ఇప్పుడు…
27వ రోజున 80-85 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ మరికొంత పెరిగే అవకాశం ఉంది. ఇక కర్ణాటక, తమిళ్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో సినిమా 20-25 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…
హిందీలో మరోసారి కుమ్మేస్తున్న సినిమా 6.5-7 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో ట్యూస్ డే ఆఫర్స్ హెల్ప్ తో పర్వాలేదు అనిపిస్తూ దూసుకు పోతుంది. దాంతో టోటల్ గా వరల్డ్ వైడ్ గా 27వ రోజున సినిమా ఇప్పుడు….
4.2-4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం పెరిగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద నాలుగో వీక్ ఎండ్ స్టేజ్ లో కూడా ఊరమాస్ హోల్డ్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర తగ్గేది లేదు అంటూ దూసుకు పోతున్నాడు ఐకాన్ స్టార్…ఇక టోటల్ గా 27 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.