బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మొదటి వీకెండ్ ని కంప్లీట్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara 4 Days Gross Collections)….మొత్తం మీద 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 136.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా…
ఓవరాల్ గా 267 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది….మేకర్స్ పబ్లిసిటీ కోసం కొంచం ఎక్కువ కలెక్షన్స్ ని పోస్టర్స్ లో యాడ్ చేసినా ఓవరాల్ గా ట్రేడ్ లెక్కల్లో 3 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవి. ఇక సినిమా 4వ రోజు వర్కింగ్ డే లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంతలో డ్రాప్స్ ను…
సొంతం చేసుకున్నా కూడా ఓకే అనిపిస్తూ 7-8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. ఇక సినిమా హిందీలో పర్వాలేదు అనిపిస్తూ ఉండగా 6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అటూ ఇటూగా…
అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక కర్ణాటక లో కోటి రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా తమిళ్ అండ్ కేరళ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా లో పెద్దగా హోల్డ్ చూపించలేదు. ఇక ఓవర్సీస్ లో సినిమా డ్రాప్స్ ను గట్టిగానే సొంతం చేసుకోగా…
ఓవరాల్ గా 4వ రోజు వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 16-17 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉండగా…. మొత్తం మీద 4 రోజుల కలెక్షన్స్ తో సినిమా ఇప్పుడు….
తెలుగు రాష్ట్రాల్లో 143 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 284-285 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది. ఇక టోటల్ గా 4 రోజుల కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.