ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) నాలుగు వారాలను ఊరమాస్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని ఊహకందని లాభాలతో దుమ్ము దుమారం లేపుతూ ఇండియన్ మూవీస్ లో ఆల్ టైం హిస్టారికల్ హిట్ గా దూసుకు పోతూ ఉండగా ఇప్పుడు 5వ వారంలో…
అడుగు పెట్టిన సినిమా అన్ని చోట్లా వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన డ్రాప్స్ ను హెవీగానే సొంతం చేసుకున్నా కూడా ఇప్పటికీ ఎక్స్ లెంట్ గా షేర్స్ ని రాబడుతూ ఉండటం మాత్రం విశేషం అనే చెప్పాలి…మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ లో సినిమా న్యూ ఇయర్ హాలిడే అయిన…
28వ రోజుతో పోల్చితే ఆల్ మోస్ట్ 70% రేంజ్ లో డ్రాప్స్ ను టికెట్ సేల్స్ లో సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే 60 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే….
షేర్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇక హిందీలో మరోసారి మంచి జోరుని చూపెడుతూ 3.5-4 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే దిశగా వెళుతున్న సినిమా కర్ణాటక తమిళ్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో అలాగే ఓవర్సీస్ లో కొంచం స్లో డౌన్ అయింది…
అయినా కూడా వరల్డ్ వైడ్ గా సినిమా 29వ రోజున ఓవరాల్ గా 2.8-3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ కొంచం పెరిగే అవకాశం ఉంది. ఓవరాల్ గా సినిమా 29వ రోజున కూడా ఇలాంటి కలెక్షన్స్ ని అందుకోవడం…
మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇక న్యూ ఇయర్ వీకెండ్ ఎలాగూ ఉండనే ఉండటంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక టోటల్ గా 29 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.