బాక్స్ ఆఫీస్ దగ్గర మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) నటించిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలంటైన్(Operation Valentine) సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి కొంచం మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకోగా మొదటి రోజు కలెక్షన్స్ పై ఆ ఇంపాక్ట్ గట్టిగానే కనిపించింది అని చెప్పాలి… మొత్తం మీద మొదటి రోజున…
80 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో వరల్డ్ వైడ్ గా 1.20 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర డ్రాప్స్ కనిపించినా కూడా ఉన్నంతలో మొదటి రోజుకి దగ్గర అయ్యే రేంజ్ లో షేర్ ని అందుకుంది. ఓవరాల్ గా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో 72 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా…
వరల్డ్ వైడ్ గా సినిమా 95 లక్షల దాకా షేర్ ని అందుకుంది…ఓవరాల్ గా 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సినిమా 1.52 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 2.15 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది సినిమా…..మొత్తం మీద సినిమా నైజాం లో 2.5 కోట్ల రేంజ్ లో అడ్వాన్స్ బిజినెస్ ను అందుకోగా….
ఓవర్సీస్ లో 1.5 కోట్ల అడ్వాన్స్ బిజినెస్ ను అందుకుందట…. మిగిలిన ఏరియాల్లో కంప్లీట్ గా ఓన్ గా రిలీజ్ చేశామని మేకర్స్ చెబుతున్నారు… కానీ ఓవరాల్ గా రిలీజ్ వాల్యూ మినిమమ్ 10 కోట్ల రేంజ్ ఉంటుంది అనుకున్నా సినిమా ఇంకా చాలా దూరమే ప్రయాణాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.