బాక్స్ ఆఫీస్ దగ్గర శ్రీ విష్ణు(Sree Vishnu) లేటెస్ట్ మూవీ శ్వాగ్(Swag Movie 2 Days Collections) రీసెంట్ గా రిలీజ్ అయ్యి డీసెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. సినిమా మొదటి రోజు మొత్తం మీద 26 వేలకు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా రెండో రోజు సినిమా పర్వాలేదు అనిపించే రేంజ్ లో గ్రోత్ ని చూపెడుతూ…
32 వేలకు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న సినిమా మొదటి రోజు మొత్తం మీద 65 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా రెండో రోజు పర్వాలేదు అనిపించేలా గ్రోత్ ని చూపెడుతూ 70 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకుంది. ఓవర్సీస్ లో మొత్తం మీద…
సినిమా లక్షన్నర రేంజ్ లో డాలర్స్ మార్క్ ని దాటేసిన సినిమా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో మాత్రం బిలో పార్ లెవల్ లోనే హోల్డ్ ని చూపించింది. తెలుగు రాష్ట్రాల్లో మేజర్ గా కలెక్షన్స్ నైజాం ఏరియా నుండే సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా…
2 రోజుల్లో ట్రేడ్ లెక్కల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
Swag Movie 2 Days Total WW Collections(EST)
👉Nizam: 0.75CR~
👉Total AP: 0.60CR~
Total AP-TG Collections:- 1.35CR~(2.60CR~ Gross)
👉KA+ROI+OS -0.60CR****
Total WW Collections – 1.95CR(4.00CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమమ్ 7.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక సినిమా క్లీన్ హిట్ అనిపించుకోవాలి అంటే మరో 5.55 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు మరోసారి పర్వాలేదు అనిపిస్తున్న సినిమా ఆల్ మోస్ట్ రెండో రోజు లెవల్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకాస్త పెరిగే అవకాశం ఉంటుంది. ఇక టోటల్ గా సినిమా 3 రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.
ఒక్క ఆర్టికల్ చదివేలోపు 100 యాడ్స్ ఇస్తున్నావ్… ఇంతకుముందే బాగానే ఉండే ఇప్పుడు ఎందుకు adds ఇస్తున్నవ్ inthala