బాక్స్ ఆఫీస్ దగ్గర హృతిక్ రోషన్ సైఫ్ అలీ ఖాన్ ల కాంబినేషన్ లో తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విక్రమ్ వేద సినిమాను అదే పేరుతో రీమేక్ చేసిన సినిమా విక్రమ్ వేద రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సూపర్ హిట్ రేంజ్ లో టాక్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది కానీ ఓపెనింగ్స్ పరంగా చూసుకుంటే మాత్రం సినిమా రీసెంట్ టైం లో…
హృతిక్ కెరీర్ లోనే లోవేస్ట్ ఓపెనింగ్స్ ని అందుకుని నిరాశ పరిచింది. తొలిరోజు మొత్తం మీద అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో 10.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రెండో రోజు టాక్ బాగుండటంతో భారీ గ్రోత్ ని…
చూపిస్తుంది అని అందరూ అనుకున్నారు కానీ జస్ట్ 20% రేంజ్ లోనే సినిమా గ్రోత్ ని చూపించి మొత్తం మీద 12.70 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. దాంతో సినిమా 2 రోజుల్లో టోటల్ గా 23.20 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని మాత్రమే సొంతం చేసుకుంది.
టాక్ సూపర్ హిట్ రేంజ్ లో ఉన్నా కానీ జనాలు ఎందుకనో ఈ సినిమాను అస్సలు పట్టించుకోవడం లేదు అని చెప్పాలి. ఇక మూడో రోజు ఊహకందని రేంజ్ లో సినిమా గ్రోత్ ని చూపించక పొతే మట్టుకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక తేరుకునే అవకాశం అయితే తక్కువే అని అంటున్నారు ట్రేడ్ వర్గాలు.