బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ ఇతర ఇండస్ట్రీ లలో మన హీరోలు సత్తా చాటాలని ట్రై చేశారు కానీ ఏవి కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఈ క్రమంలో తన సినిమాలకు హిందీ డబ్బింగ్ లో వచ్చిన సెన్సేషనల్ వ్యూస్ ని చూసి డైరెక్ట్ సినిమా చేయాలనీ డిసైడ్ అయిన…
బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sreenivas) ప్రభాస్(Prabhas) ఛత్రపతి(Chatrapathi) సినిమాను వివి వినాయక్(VV Vinayak) డైరెక్షన్ లో హిందీలో అదే పేరుతో రీమేక్ చేసి మే 12న రిలీజ్ చేయగా టీసర్ క్లిక్ అవ్వడంతో సినిమాకి…
మినిమమ్ ఓపెనింగ్స్ అయినా వస్తాయి అనుకున్నా కోటి లోపే నెట్ కలెక్షన్స్ తో పరుగును పూర్తీ చేసుకున్న ఈ సినిమా కోసం పబ్లిసిటీ ఖర్చులతో కలిపి 85 కోట్ల రేంజ్ లో బడ్జెట్ పెట్టినట్లు ట్రేడ్ లో టాక్ ఉండగా బడ్జెట్ వైజ్ భారీ డిసాస్టర్ గా నిలిచిన ఈ సినిమా….
నాన్ థియేట్రికల్ రైట్స్ 35 కోట్ల దాకా రేటును సొంతం చేసుకోగా Amazon Prime వాళ్ళు సినిమా డిజిటల్ రైట్స్ ను తీసుకుని 5 వారాల లోపే డిజిటల్ రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి కానీ సినిమా రిలీజ్ అయ్యి 2 నెలలు అయినా కూడా ఇప్పటి వరకు…
సినిమా డిజిటల్ రిలీజ్ పై ఎలాంటి అప్ డేట్ లేక పోవడంతో సినిమా డిజిటల్ రిలీజ్ ఎప్పుడు అవుతుందో అన్నది క్లారిటీ లేకుండా పోయింది. సౌత్ ఆడియన్స్ హిందీ లో సినిమాను మిస్ చేసుకున్నా డిజిటల్ లో చూడాలి అనుకున్నారు కానీ టీం ఇప్పటి వరకు డిజిటల్ రిలీజ్ గురించి ఎలాంటి అప్ డేట్ చేయలేదు. మరి ఎప్పుడు సినిమా డిజిటల్ రిలీజ్ అవుతుందో చూడాలి.