Home న్యూస్ బంగార్రాజు@డే-2 ఓపెనింగ్స్…ఈ రోజు కూడా కుమ్ముడే!!

బంగార్రాజు@డే-2 ఓపెనింగ్స్…ఈ రోజు కూడా కుమ్ముడే!!

0

కింగ్ నాగార్జున యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ బంగార్రాజు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపే రేంజ్ లో ఓపెన్ అవ్వడం విశేషం. సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇటు నాగార్జున కెరీర్ లో కానీ అటు నాగ చైతన్య కెరీర్ లో కానీ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని…

సంచలనం సృష్టించింది… ఫస్ట్ డే హైర్స్ ని పక్కకు పెడితే సినిమా తెలుగు రాష్ట్రాలలో 6.46 కోట్ల వర్త్ షేర్ తో అద్బుతమైన స్టార్ట్ ను సొంతం చేసుకోగా రెండో రోజు మకర సంక్రాంతి హాలిడే అండ్ వీకెండ్ అడ్వాంటేజ్ సాలిడ్ గానే ఎంజాయ్ చేస్తుంది ఈ సినిమా…

రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా ఇప్పుడు మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు మార్నింగ్ షోలకు 15% పైగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది కానీ తిరిగి మ్యాట్నీ షోల నుండి జోరు చూపెట్టడం మొదలు పెట్టిన సినిమా అన్ని సెంటర్స్ లో జోరు చూపుతుంది కానీ నైజాం ఏరియాలో మాత్రం సినిమా….

అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయడం లేదు, జనాలు అందరూ ఊర్లకి తిరిగి వెళ్ళడం వలన ఆక్యుపెన్సీ అనుకున్న రేంజ్ లో లేదు. అయినా కానీ మ్యాట్నీ షోల నుండి ఇక్కడ కూడా సినిమా పుంజుకుంటూ ఉండగా మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ని చూస్తుంటే సినిమా ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 4.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే…

అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి… అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా ఓవరాల్ కలెక్షన్స్ లెక్క 5 కోట్ల మార్క్ ని అందుకోవచ్చు. మరి అంతకుమించి ముందుకు వెళుతుందో లేదో ఈవినింగ్ షోల గ్రోత్ ని బట్టి చెప్పగలం. రోజు ముగిసే సరికి సినిమా బాక్స్ ఆఫీస్ స్టేటస్ ఎంతవరకు వెళుతుందో చూసి మరో ఆర్టికల్ లో అప్ డేట్ చేస్తాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here