Home న్యూస్ గ్యాంగ్ లీడర్ డే 2 కలెక్షన్స్…కుమ్ముతున్నాడు!!

గ్యాంగ్ లీడర్ డే 2 కలెక్షన్స్…కుమ్ముతున్నాడు!!

0

నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మంచి వసూళ్ళతో జోరు చూపింది, అడ్వాన్స్ బుకింగ్స్ స్లో గా స్టార్ట్ అయినా కానీ సాలిడ్ గా మొదటి రోజు కలెక్షన్స్ లో నాని మార్క్ ని చూపెడుతూ రెచ్చిపోయింది ఈ సినిమా. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా ఫస్ట్ డే 4.57 కోట్ల షేర్ ని రెండు రాష్ట్రాలలో…

7 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకోగా సినిమా రెండో రోజు మాస్ సెంటర్స్ లో కొద్దిగా స్లో డౌన్ అయింది, అది కామన్ అనే చెప్పాలి. కానీ మిగిలిన సెంటర్స్ లో మాత్రం సాలిడ్ గా హోల్డ్ చేసి సత్తా చాటుకుంది ఈ సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ నాని సినిమాలను ఎంతలా ఇష్టపడతారో…

మరో సారి నిజం చేస్తూ రెండో రోజు భారీ సంఖ్యలో ఫ్యామిలీ ఆడియన్స్ తో థియేటర్స్ నిండిపోయాయి. ఓవరాల్ గా మొదటి రోజు తో పోల్చితే రెండో రోజు ఆన్ లైన్ టికెట్ సేల్స్ డ్రాప్స్ 25% వరకు మాత్రమె ఉంది. ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ఆ రేంజ్ లోనే ఉంటె సినిమా…

రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అవలీలగా 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేయోచ్చు. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు మరింత ఎక్కువ ఉంటె కనుక సినిమా రెండో రోజు 4 కోట్ల కి చేరువ అవ్వడం కానీ మించే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు. ఇక రెండో రోజు వరల్డ్ వైడ్ షేర్…

5 కోట్ల లోపు ఉండే అవకాశం ఉండటం తో టోటల్ గా 2 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 12 కోట్ల దాకా ఉండే అవకాశం ఉంది. ఇక ఆదివారం కూడా జోరు కొనసాగితే చాలా వరకు బిజినెస్ రికవరీ అయ్యే అవకాశం ఉంది. ఇక 2 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఏ విధంగా ఉంటాయి అన్నది ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here