బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఊహించని విధంగా గ్రోత్ ని సాధించి అనుకున్న టార్గెట్ ని కూడా మించి వసూళ్లు సాధించింది, 1.2 కోట్ల నుండి 1.5 కోట్ల రేంజ్ వసూళ్లు వస్తాయి అనుకున్నా సినిమా మొదటి రోజు టోటల్ గా 2.05 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది, ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు నైజాం ఏరియా లో సాలిడ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది అని చెప్పొచ్చు.
మొదటి రోజు తో పోల్చితే రెండో రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల కి కేవలం 15% లోపే డ్రాప్స్ ని సొంతం చేసుకుంది, ఇది అల్టిమేట్ లెవల్ లో హోల్డ్ చేయడం అనే చెప్పాలి. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల కి బాక్స్ ఆఫీస్ దగ్గర బుకింగ్స్ కూడా జోరు అందుకున్నాయి.
ప్రస్తుతం ఉన్న ఓపెనింగ్స్ ని బట్టి రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా 50 లక్షల కి పైగా షేర్ ని నైజాం లో అందుకునే అవకాశం ఉంది, ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ అండ్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఉంటే సినిమా…
రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 60 లక్షల నుండి 65 లక్షల రేంజ్ వసూళ్ళ ని అందుకునే అవకాశం ఉంది, ఒక ఓవర్సీస్ లో సినిమా అల్టిమేట్ లెవల్ లో హోల్డ్ చేస్తూ దూసుకు పోతుండటం తో సినిమా అక్కడ కూడా రెండో రోజు మంచి వసూళ్లు కురిపించే అవకాశం ఉంది.
IPL లో ఈ రోజు 2 మ్యాచులు ఉండటం తో ఆ ఎఫెక్ట్ కొంచం వరకు ఉండే అవకాశం ఉంది, అది తప్పితే రెండో రోజు కూడా సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకునే చాన్స్ ఉంది, డే ఎండింగ్ కి సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.