Home న్యూస్ 1.5 అనుకుంటే…ఫస్ట్ డే “లక్ష్మీస్ ఎన్టీఆర్” టోటల్ కలెక్షన్స్ తెలిస్తే షాక్!

1.5 అనుకుంటే…ఫస్ట్ డే “లక్ష్మీస్ ఎన్టీఆర్” టోటల్ కలెక్షన్స్ తెలిస్తే షాక్!

0

     రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అంచనాలను మించి వసూళ్లు సాధించింది, సినిమా ఆంధ్రలో రిలీజ్ కి నోచు కోక పోవడం తో టోటల్ ప్రెజర్ మొత్తం నైజాం ఏరియా లోనే పడగా సర్పైజ్ గా సినిమా ఇక్కడ తో పాటు ఓవర్సీస్ మార్కెట్ లో కూడా భారీ గా పుంజు కోవడం తో తొలిరోజు కలెక్షన్స్ పరంగా సాలిడ్ ట్రెండ్ ని సాధించింది.

ఈవెనింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ చూసి 1.2 కోట్ల నుండి 1.5 కోట్ల రేంజ్ లో వరల్డ్ వైడ్ షేర్ వస్తుంది అని అంచనా వేసినా ఓవరాల్ గా మొదటి రోజు లెక్క ఏకంగా 2 కోట్ల మార్క్ ని అందుకుని అద్బుతమైన గ్రోత్ ని సాధించి దిమ్మ తిరిగే షాక్ కూడా ఇచ్చింది.

ఆంద్ర లో రిలీజ్ లేకుండా కూడా ఈ రేంజ్ లో ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా అక్కడ కూడా రిలీజ్ అయ్యి ఉంటే కచ్చితంగా తొలిరోజు వరల్డ్ వైడ్ గా అవలీలగా 3.5 కోట్ల వరకు షేర్ ని అందుకునే అవకాశం ఉండేది, ఇక మొదటి రోజు ఏరియాల వారి కలెక్షన్స్…

ని ఒకసారి గమనిస్తే… Nizam – 90L ROI- 25L USA- 70L ROW- 20L 1st day total ww- 2.05Cr. ఇదీ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వివరాలు. సినిమా టోటల్ గ్రాస్ 3.4 కోట్ల దాకా వసూళ్లు తొలిరోజు అందుకున్నట్లు సమాచారం.

సినిమా కి కొంత మిశ్రమ టాక్ వచ్చినా ఫైనల్ గా యావరేజ్ టాక్ అని అంతటా స్ప్రెడ్ అయ్యింది, ఆ టాక్ తో కూడా సినిమా సాలిడ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది, ఇక రెండో రోజు సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయో త్వరలో అప్ డేట్ చేస్తాం.. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here