యాక్షన్ హీరో గోపీచంద్ లేటెస్ట్ మూవీ పక్కా కమర్షియల్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా ఫస్ట్ డే ఓవరాల్ గా అనుకున్న దాని కన్నా కూడా బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది కానీ అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా బెటర్ కలెక్షన్స్ ని లాంగ్ రన్ లో అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజుతో పోల్చితే ఆల్ మోస్ట్….
50-55% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఈవినింగ్ షోల నుండి కొద్ది వరకు పుంజుకున్నా ఓవరాల్ డ్రాప్స్ కొంచం ఎక్కువగానే ఉన్నాయి. ఓవర్సీస్ లో ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో 73 వేల డాలర్స్ ను అందుకోగా సినిమా ఇప్పుడు రెండో రోజు కూడా పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసింది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో సినిమా 1.1 కోట్ల నుండి 1.20 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 1.3 కోట్లకి పైగా కలెక్షన్స్ ని అందుకోవచ్చు. కానీ అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా మినిమమ్ 1.5 కోట్ల నుండి 1.7 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవాలి. మరి సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని డే 2 లో అందుకుంటుందో చూడాలి….