Home న్యూస్ సీటిమార్ 2nd డే కలెక్షన్స్…మాస్ కుమ్ముడు!

సీటిమార్ 2nd డే కలెక్షన్స్…మాస్ కుమ్ముడు!

0

గోపీచంద్ తమన్నా ల కాంబినేషన్ లో సంపత్ నంది డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సీటిమార్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ నిరాశ కలిగించే విధంగా ఉన్నప్పటికీ కూడా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా మాత్రం సినిమా దుమ్ము లేపే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటుకుంది. తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 3 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని…

ఫస్ట్ డే సొంతం చేసుకున్న ఈ సినిమా నార్మల్ టైం లో అయ్యి ఉంటే 4.5 కోట్లకు పైగా కలెక్షన్స్ ని ఫస్ట్ డే సొంతం చేసుకుని ఉండేది. ఇక మొదటి రోజు వినాయక చవితి హాలిడే కూడా కలిసి రాగా రెండో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….

వీకెండ్ ని మొదలు పెట్టినా కానీ…మొదటి రోజు తో పోల్చితే 55% డ్రాప్స్ ను మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు సొంతం చేసుకోగా తిరిగి ఈవినింగ్ షోలకు మంచి ట్రెండ్ ని కొనసాగించిన సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్ళని సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది…

ఆంధ్రప్రదేశ్ లో బి సి సెంటర్స్ లో సినిమా సూపర్ సాలిడ్ గా మాస్ కుమ్ముడు కుమ్ముతున్నా కానీ అక్కడ టికెట్ రేట్లు తక్కువగా ఉండటం, దానికి తోడూ 50% లిమిటేషన్ ఉండటం కలెక్షన్స్ పరంగా సంచలనం అనలేం కానీ మాస్ జనాలు చాలా టైం తర్వాత థియేటర్స్ కి రప్పించేలా చేసింది ఈ సినిమా.. కానీ తెలంగాణలో కలెక్షన్స్ కొంచం అండర్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి.

అయినా కానీ రెండో రోజు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 1.4 కోట్ల నుండి 1.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఇంకా బాగుంటే ఈ కలెక్షన్స్ లెక్క ఇంకా ఎక్కువగా వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక 2 రోజులకు గాను సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here