బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో తమిళ్ డబ్బింగ్ మూవీస్ కలిపి 3 కోట్లకి పైగా షేర్ ని మొదటి రోజు అందుకుంది, కాగా విజిల్ తమిళ్ వర్షన్ తో కలిపి వరల్డ్ వైడ్ గా 60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకున్నట్లు సమాచారం. ఇక ఖైదీ సినిమా 7 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకుందట. ఇక రెండు సినిమాలు రెండోరోజు బరిలోకి దిగగా…
రెండు సినిమాలు ఈ రోజు కొంచం డౌన్ అయినట్లు తెలుస్తుంది, విజిల్ సినిమా మొదటి రోజు తో పోల్చితే 40% వరకు డ్రాప్స్ ని సొంతం చేసుకుని షాక్ ఇవ్వగా ఖైదీ మాత్రం షాకింగ్ గా కేవలం 15 టు 20% వరకు డ్రాప్స్ ని మాత్రమె సొంతం చేసుకుని విజిల్ కన్నా తక్కువ డ్రాప్స్ ని అందుకుంది.
ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కూడా రెండు సినిమాలు నెక్ టు నెక్ దూసుకు పోగా తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయినా కానీ ఖైదీ మంచి ట్రెండ్ ని కొనసాగిస్తుంది, ఇక విజిల్ ఓవరాల్ గా 10% వరకు గ్రోత్ ని సాధించగా సినిమా రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో…
ఇప్పుడు 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని సమాచారం. ఇక ఖైదీ సినిమా రెండు రాష్ట్రాలలో రెండో రోజు 50 లక్షల రేంజ్ కి తగ్గని కలెక్షన్స్ ని అందుకోవచ్చట. ఫైనల్ నంబర్ పెరిగే అవకాశం కూడా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక వరల్డ్ వైడ్ గా విజిల్ సినిమా రెండో రోజు….
30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకోవచ్చని అంచనా వేస్తున్నారు, ఇక ఖైదీ 4 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవచ్చని అంటున్నారు. అసలు సెలవులు ఆదివారం మరియు సోమవారం ఉంటాయి కాబట్టి ఈ రెండు సినిమాలు మూడు నాలుగు రోజుల్లో దుమ్ము లేపే చాన్స్ ఉందని చెప్పొచ్చు. ఇక 2 సినిమాల 2 రోజుల కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.