Home గాసిప్స్ ప్రపంచం అంతా కుమ్ముంది…ఆ ఒక్క చోట తప్ప!!

ప్రపంచం అంతా కుమ్ముంది…ఆ ఒక్క చోట తప్ప!!

0

     కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ బిగిల్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచలన రికార్డులను నమోదు చేసిందో అందరికీ తెలిసిందే, 2 వారాలు పూర్తీ అయ్యే సరికి వరల్డ్ వైడ్ గా సినిమా 268 కోట్ల లోపు గ్రాస్ ని వసూల్ చేసి విజయ్ కెరీర్ లో నే ఆల్ టైం నంబర్ 1 మూవీ గా నిలిచి దుమ్ము దుమారం చేసే రికార్డులను సొంతం చేసుకుని ఊచకోత కోసింది.

తెలుగు రాష్ట్రాల్లో హీరో కూడా రాకుండా కేవలం ఒక ప్రెస్ మీట్ ప్రమోషన్ మాత్రమె జరిగినా కానీ ఇక్కడ కూడా సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకుని హిట్ అవ్వగా కర్ణాటక అటు కేరళలో ఊచకోత కోసే కలెక్షన్స్ ని అందుకుని తన కెరీర్ బెస్ట్ రికార్డులను నమోదు చేశాడు.

ఇక ఓవర్సీస్ లో కూడా సౌత్ లోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఓవర్సీస్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా గా నిలిచిన ఈ సినిమా ప్రపంచం అంతా సంచలన కలెక్షన్స్ ని అందుకుని బ్రేక్ ఈవెన్ అవ్వగా స్వంత చోటు అయిన తమిళనాడు లో మాత్రం టార్గెట్ ని అందుకోవడం లో వెనకడుగు వేసి షాక్ ఇచ్చింది.

సినిమా ను తమిళనాడు లో 83.5 కోట్లకు అమ్మారు, కాగా సినిమా 2 వారాలు పూర్తీ అయ్యే సరికి 124 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని 75 కోట్లకి అటూ ఇటూ గా షేర్ ని ఇప్పటి వరకు వసూల్ చేసింది, అంటే అక్కడ హిట్ అవ్వాలి అంటే మరో 9 కోట్లు వసూల్ చేయాల్సి ఉంటుంది.

2 వారాల తర్వాత బాగా స్లో అయిన సినిమా ఆ మార్క్ ని అందుకోవడం కష్టమే అంటున్నారు, పోటి లో ఉన్న ఖైదీ మూడో వారం లో కూడా జోరు చూపుతుండటం తో అది బిగిల్ కి ఎఫెక్ట్ అవ్వనుంది. దాంతో ప్రపంచం అంతా దుమ్ము లేపిన బిగిల్ ఓన్ ప్లేస్ లో ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టంగా కనిపిస్తుంది. మరి లాంగ్ రన్ లో ఏదైనా అద్బుతం జరుగుతుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here