Home టోటల్ కలెక్షన్స్ విజిల్ తెలుగు కలెక్షన్స్: టార్గెట్ 11 కోట్లు…టోటల్ గా వచ్చింది ఇది!!

విజిల్ తెలుగు కలెక్షన్స్: టార్గెట్ 11 కోట్లు…టోటల్ గా వచ్చింది ఇది!!

0

     కోలివుడ్ టాప్ హీరో ఇలయ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ బిగిల్ తెలుగు లో విజిల్ పేరు తో డబ్ అయ్యి రిలీజ్ అవ్వగా సినిమా ఇక్కడ అల్టిమేట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది. ఇక్కడ ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలకు హీరో రాక పోయినా కానీ టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ అందరు సినిమా చూడటానికి ఎగబడగా కలెక్షన్స్ పరంగా సినిమా లాంగ్ రన్ లో దుమ్ము లేపి క్లీన్ హిట్ అయింది.

సినిమా ను తెలుగు లో మొత్తం మీద 10.25 కోట్లకు అమ్మగా సినిమా 11 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది, కాగా సినిమా దీపావళి వీకెండ్ లో మంచి వసూళ్ళని సాధించగా తర్వాత కూడా స్లో డౌన్ అవ్వకుండా పోటి లో ఉన్న ఖైదీ సినిమా రెచ్చిపోయినా కానీ..

పరుగును స్టడీ గా కొనసాగించి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ పూర్తీ అయ్యే సరికి 11 కోట్ల టార్గెట్ ని అందుకుని ఫైనల్ రన్ లో 11.57 కోట్ల షేర్ మార్క్ ని అలాగే 20.62 కోట్ల గ్రాస్ ని తెలుగు రాష్ట్రాలలో అందుకుని 57 లక్షల ప్రాఫిట్ తో క్లీన్ హిట్ గా నిలిచింది. 

సినిమా టోటల్ ఏరియాల వారి కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
?Nizam: 3.78Cr
?Ceeded: 2.93Cr
?UA: 1.25Cr
?East: 71L
?West: 52L
?Guntur: 1.12Cr
?Krishna: 78L
?Nellore: 48L
AP-TG Total:- 11.57Cr( Gross: 20.62Cr)  ఇదీ మొత్తం మీద సినిమా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు.

ఇక సినిమా తమిళ్ వర్షన్ లిమిటెడ్ కలెక్షన్స్ తో రన్ అవుతూ ఉంది, దాంతో టోటల్ అన్ని వర్షన్స్ కలెక్షన్స్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. మొత్తం మీద తెలుగు వర్షన్ వరకు మాత్రం విజయ్ కి ఇక్కడ సాలిడ్ మార్కెట్ ఏర్పడింది అని చెప్పొచ్చు. మరో 2 మూడు సినిమాలు ఇలాంటి రిజల్ట్ నే సొంతం చేసుకుంటే రజినీ కలెక్షన్స్ ని కూడా ఇక్కడ టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here