Home న్యూస్ మిక్సుడ్ టాక్…అయినా రెండో రోజు ఆ ఒక్కటి అడక్కుకి హౌస్ ఫుల్స్ పడుతున్నాయిగా!

మిక్సుడ్ టాక్…అయినా రెండో రోజు ఆ ఒక్కటి అడక్కుకి హౌస్ ఫుల్స్ పడుతున్నాయిగా!

0

అల్లరి నరేష్(Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ ఆ ఒక్కటీ అడక్కు(Aa Okkati Adakku Movie) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయింది, సినిమా పాయింట్ బాగున్నా కూడా కథని డైరెక్టర్ చెప్పిన విధానం కొంచం స్లోగా రొటీన్ గా ఉండటంతో సినిమా కి మొదటి రోజు కొంచం టాక్ మిక్సుడ్ గా వచ్చింది…

ఓపెనింగ్స్ కూడా కొంచం తక్కువగానే వచ్చాయి…చాలా వరకు కొంచం టాక్ అటూ ఇటూగా ఉన్నా సినిమాలు రెండో రోజు నుండి స్లో అవుతూ ఉంటాయి, అల్లరి నరేష్ ఆ ఒక్కటీ అడక్కు సినిమా టాక్ కొంచం మిక్సుడ్ గానే ఉన్నా కూడా రెండో రోజు వీకెండ్ అడ్వాంటేజ్ వలన మార్నింగ్ మ్యాట్నీ షోలకు కొన్ని చోట్ల…

మంచి ఆక్యుపెన్సీ ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కొన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కూడా పడ్డాయి…ఇప్పటికీ అల్లరినరేష్ ఎంటర్ టైన్ మెంట్ మూవీస్ చేస్తే టాక్ కి అతీతంగా చూడటానికి జనాలు సిద్ధంగా ఉన్నారని మరోసారి రుజువు అయ్యింది అని చెప్పాలి. మొత్తం మీద రెండో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 65-70 లక్షల రేంజ్ లో….

షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఎక్కువగా ఉంటే కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పాలి. టాక్ కొంచం బెటర్ గా ఉండి ఉంటే ఈ కలెక్షన్స్ లెక్కలు కూడా ఇంకా బెటర్ గా వచ్చి ఉండేది. ఇక టోటల్ గా 2 రోజులకు గాను సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here