మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్(Mr Bachchan Movie 2nd Day Collections) సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో ఎలాగోలా పర్వాలేదు అనిపించినా కూడా కలెక్షన్స్ పరంగా అండర్ పెర్ఫార్మ్ చేసింది…
ఇక సినిమా నేషనల్ హాలిడే రోజు తర్వాత వర్కింగ్ డే లోకి అడుగు పెట్టగా శుక్రవారం వీకెండ్ స్టార్ట్ అయినా కూడా వర్కింగ్ డే లో ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించడం లేదు…మొదటి రోజు ఆల్ మోస్ట్ 53 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న సినిమా…
రెండో రోజు అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంటుంది ఇప్పుడు. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కొంచం పర్వాలేదు అనిపించేలా ఉన్న నేపధ్యంలో మొత్తం మీద రెండో రోజు ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా ఓవరాల్ గా….
1 కోటి రేంజ్ నుండి 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 1.4-1.5 కోట్ల దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉంది కానీ దానికి కూడా సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1.7-1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే…కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఈ కలెక్షన్స్ అసలు బ్రేక్ ఈవెన్ ని అందుకోవడానికి సరిపోవు అనే చెప్పాలి. ఇక 2 రోజుల్లో సినిమా సాధించే కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.