బాక్స్ ఆఫీస్ దగ్గర ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన లేటెస్ట్ మూవీ స్కంద(Skanda Movie) మొదటి రోజు అనుకున్న దాని కన్నా కూడా బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. రామ్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న….
స్కంద మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజులో ఎంటర్ అవ్వగా రెండో రోజు వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన సినిమా మిగిలిన సినిమాల మాదిరిగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుందని చెప్పాలి ఇప్పుడు… ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో సినిమా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు…
ఆల్ మోస్ట్ 60%కి పైగా డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఆఫ్ లైన్ కౌంటర్ దగ్గర మాస్ సెంటర్స్ లో టికెట్ సేల్స్ లో కొద్ది వరకు హోల్డ్ ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు సినిమా కొంచం బెటర్ ట్రెండ్ ను చూపించే అవకాశం ఉండగా…
సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా బెటర్ హోల్డ్ ని చూపించాల్సిన అవసరం ఉండగా… ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి సినిమా మొత్తం మీద ఇప్పుడు ఉన్న బుకింగ్స్ ను బట్టి 3.5 కోట్ల రేంజ్ నుండి 3.8 కోట్ల దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…
ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా గ్రోత్ ని కనుక చూపిస్తే 4 కోట్ల దాకా షేర్ ని అందుకోవచ్చు, మొత్తం మీద మరోసారి సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పైనే ఎక్కువగా డిపెండ్ అయ్యింది. మరి డే ఎండ్ అయ్యే టైంకి సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.