Home న్యూస్ పెద్దకాపు1 రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

పెద్దకాపు1 రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

క్లాస్ సినిమాల డైరెక్టర్ గా పేరున్న శ్రీకాంత్ అడ్డాల(Srikanth Addala) అసురన్ తెలుగు రీమేక్ నారప్ప(Narappa) తో రూట్ మార్చినా అది రీమేక్ అవ్వడంతో పెద్దగా గుర్తింపు రాలేదు, కానీ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు పెద్దకాపు1(PeddhaKapu1) సినిమాతో మరింత రా రస్టిక్…

నేపధ్యంలో సినిమా చేయగా ట్రైలర్ రిలీజ్ తర్వాత మంచి అంచనాలు ఏర్పడ్డ ఈ సినిమా ఆడియన్స్ ముందుకు ఇప్పుడు భారీ లెవల్ లో రిలీజ్ అవ్వగా సినిమా అంచనాలను ఎంతవరకు అందుకుందో తెలుసుకుందాం పదండీ… ముందుగా సినిమా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే….

1980’s టైంలో గోదావరి జిల్లాలో ఇద్దరు ఊరి పెద్దల నడుమ నలిగిపోతున్న ఊరులో తెలుగు దేశం పార్టీ ఎంటర్ అయిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి… ఇందులో హీరో అయిన పెద్దకాపు రోల్ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

శ్రీకాంత్ అడ్డాల నుండి ఇలాంటి జానర్ ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేసి ఉండరు, ఈ జానర్ లో తన మార్క్ ని చూపెట్టుకునే కొన్ని సీన్స్ ని బాగానే రాసుకున్న శ్రీకాంత్ అడ్డాల ఇంటర్వెల్ ఎపిసోడ్, క్లైమాక్స్ ఎపిసోడ్ ఎక్స్ లెంట్ గా తీశాడు… అలాగే రావ్ రమేష్ రోల్ మరోసారి హైలెట్ అవ్వగా…

హీరోగా నటించిన విరాట్ కర్ణ కూడా బాగానే ఈజ్ తో నటించి మెప్పించగా హీరోయిన్ పర్వాలేదు అనిపించింది… మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా తమ తమ రోల్స్ లో మెప్పించగా సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా కి భారీ ప్లస్ పాయింట్…

కొన్ని చోట్ల మిక్కీ జే మేయర్ బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగా మెప్పించాగా చోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ ఎక్స్ లెంట్ అని చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి… ఇన్ని బాగున్నాయి అంటే సినిమా కూడా అద్బుతమే అని అనుకోవచ్చు…

కానీ డీసెంట్ స్టోరీ పాయింట్ ని శ్రీకాంత్ అడ్డాల చాలా కన్ఫ్యూజింగ్ గా తెరకెక్కించగా చాలా సీన్స్ డ్రాగ్ అయినట్లు బోర్ ఫీల్ అయ్యేలా చేయగా ఎటు నుండి ఏటో వెళ్ళే స్క్రీన్ ప్లే ఆడియన్స్ కి నీరసం తెప్పిస్తుంది… కొన్ని సీన్స్ బాగున్నా కూడా ఓవరాల్ గా సినిమా పరంగా మాత్రం….

అంచనాలను అందుకోలేక పోయింది పెద్దకాపు1 సినిమా…. ట్రైలర్ ని చూసిన తర్వాత భారీ అంచనాలతో థియేటర్స్ కి వెళితే మాత్రం నిరాశఎక్కువగా ఉంటుంది. లో ఎక్స్ పెర్టేషన్స్ తో థియేటర్స్ కి వెళితే సినిమా ఉన్నంతలో కొంచం ఓపిక పట్టి చూస్తే ఒకసారి చూడొచ్చు అనిపించవచ్చు. మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 2.5 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here