Home న్యూస్ 2nd డే SPY-సామజవరగమనా కలెక్షన్స్…2 సినిమాల హోల్డ్ ఎలా ఉందంటే!

2nd డే SPY-సామజవరగమనా కలెక్షన్స్…2 సినిమాల హోల్డ్ ఎలా ఉందంటే!

0

జూన్ లాస్ట్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు నిఖిల్ సిద్దార్థ్(Nikhil Siddhartha) నటించిన స్పై(SPY Movie) మరియు శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన సామజవరగమనా (Samajavaragamana) సినిమాలు రిలీజ్ అవ్వగా రెండింటిలో సామజవరగమనా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

కానీ ఓపెనింగ్స్ లో స్పై మూవీ ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో దుమ్ము దులిపేసింది. ఇక రెండో రోజు రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నార్మల్ డే అవ్వడంతో డ్రాప్స్ ను సొంతం చేసుకున్నాయి. సామజవరగమనా సినిమా పాజిటివ్ టాక్ వలన మంచి హోల్డ్ ని…

చూపించగా ఓవరాల్ గా చూసుకుంటే టాక్ అడ్వాంటేజ్ తో ఇంకా రెచ్చిపోవాలి కానీ సినిమా అలా ఏమి ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో రెచ్చిపోవడం లేదు… దాంతో సినిమా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు డీసెంట్ గా ఉంటే 60 లక్షల రేంజ్ లో షేర్ ని ఈ రోజు…

సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక రెండో రోజులో అడుగు పెట్టిన స్పై మూవీ ఆల్ మోస్ట్ 60% కి పైగానే ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది, ఆఫ్ లైన్ లో కూడా ఇదే విధంగా ఉంటే 1.5 కోట్ల నుండి 1.6 కోట్ల రేంజ్ లో..

షేర్ ని అందుకునే అవకాశం ఉంటుంది. మొత్తం మీద 2 సినిమాలకు ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ఇప్పుడు కీలకం అని చెప్పాలి. సామజవరగమనా కి వచ్చిన టాక్ దృశ్యా ఇంకొంచం ఎక్కువ జోరు చూపాల్సిన అవసరం ఉంది. ఇక 2 సినిమాల అఫీషియల్ 2 డేస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here