బాక్స్ ఆఫీస్ దగ్గర బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన బాలీవుడ్ ఫస్ట్ మూవీ ఛత్రపతి ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎపిక్ డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. సినిమా మాస్ సెంటర్స్ లో అయినా జోరు చూపిస్తుంది అనుకున్నా కూడా మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా సొంతం చేసుకోలేక పోయిన సినిమా మొదటి రోజు నుండే చేతులు ఎత్తేసింది.
ఇక వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ ని వర్కింగ్ డేస్ లో నెగటివ్ కలెక్షన్స్ వలన మరింతగా తగ్గిపోగా సినిమా కలెక్షన్స్ మొత్తం మీద మొదటి వారంలో కోటి రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ ని అందుకుని అత్యంత దారుణంగా నిరాశ పరిచింది సినిమా… మొత్తం మీద సినిమాను రిలీజ్ చేయడం…
2500 వరకు స్క్రీన్స్ లో రిలీజ్ చేయాలి అనుకున్నా ది కేరళ స్టొరీ వలన 1500 స్క్రీన్స్ లో రిలీజ్ అయిన సినిమా ఛత్రపతి మొదటి వీకెండ్ లోనే చేతులు ఎత్తేయడంతో సగానికి పైగా స్క్రీన్స్ ని కోల్పోగా ఇక మొదటి వారం తర్వాత సినిమా మరింతగా నిరాశ పరుస్తూ…
కేవలం 300 లోపు స్క్రీన్స్ లోనే సినిమా రెండో వారాన్ని కొనసాగిస్తుంది. అది కూడా మాస్ సెంటర్స్ లోనే, కానీ అక్కడ నుండి కూడా సినిమాకి ఏమాత్రం కలెక్షన్స్ రావడం లేదు. ఓవరాల్ గా 85 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా మినిమమ్ ప్రింట్ ఖర్చులను కూడా రికవరీ చేయలేక పోయింది.