బాక్స్ ఆఫీస్ దగ్గర త్వరలో తెలుగు లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న తమిళ్ డబ్బింగ్ మూవీ లవ్ స్టొరీ…. తమిళనాడులో ఎలాంటి అంచనాలు లేకుండా చాలా సైలెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి సంచలన కలెక్షన్స్ తో హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సినిమా బడ్జెట్ దృశ్యా చెప్పాలి అంటే వన్ ఆఫ్ ది బిగ్…
బ్లాక్ బస్టర్స్ లో ఒకటి అని చెప్పొచ్చు. కేవలం 5 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా తమిళనాట అన్ సీజన్ అయిన నవంబర్ లో కూడా ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. రీసెంట్ గా 2 వారాలను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా…
తమిళనాడులో ఏకంగా 46 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా టోటల్ రెస్ట్ ఆఫ్ ఇండియా లో 4 కోట్ల దాకా గ్రాస్ ను అందుకోగా ఇండియాలో ఏకంగా 50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇక ఓవర్సీస్ లో మరో 6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న ఈ సినిమా…
టోటల్ వరల్డ్ వైడ్ గా ఏకంగా 56 కోట్ల గ్రాస్ ను 2 వారాల్లో సొంతం చేసుకోగా థియేట్రికల్ షేర్ ఆల్ మోస్ట్ 29 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా… 5 కోట్ల బడ్జెట్ మీద 2 వారాల్లో 56 కోట్ల గ్రాస్ ను 29 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా హ్యుమంగస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక తెలుగు రిలీజ్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.