బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మతిరిగే రేంజ్ లాభాలతో దూసుకు పోతున్న టిల్లు స్క్వేర్(Tillu Square Movie) ఇప్పుడు రెండు వారాలను రిమార్కబుల్ కలెక్షన్స్ తో పూర్తి చేసుకుంది. సినిమా రెండో వారంలో వీకెండ్ తో పాటు వర్కింగ్ డేస్ లో 2 హాలిడే అడ్వాంటేజ్ లు లభించడంతో అన్ని చోట్లా సాలిడ్ గా జోరు చూపించింది…
దాంతో మొత్తం మీద 2 వారాలను రిమార్కబుల్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది టిల్లు స్క్వేర్ మూవీ. ఇక 14వ రోజు రంజాన్ పండగ అడ్వాంటేజ్ తో దుమ్ము లేపిన ఈ సినిమా…..
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 1.24 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 1.42 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 2.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది సినిమా. దాంతో టోటల్ గా 2 వారాల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Tillu Square 14 Days Total World Wide Collections Report(INC GST)
👉Nizam: 23.43Cr
👉Ceeded: 5.13Cr
👉UA: 5.42Cr
👉East: 2.77Cr
👉West: 1.69Cr
👉Guntur: 2.37Cr
👉Krishna: 2.18Cr
👉Nellore: 1.38Cr
AP-TG Total:- 44.37CR(73.75CR~ Gross)
👉KA+ROI: 3.83Cr
👉OS: 13.42Cr
Total WW:- 61.62CR (108.00CR~ Gross)
మొత్తం మీద సినిమా 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 2 వారాలు పూర్తి అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 33.62 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హ్యుమంగస్ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక మూడో వారంలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ తో జోరు చూపిస్తుందో చూడాలి ఇప్పుడు.