Home న్యూస్ 350 కోట్ల సినిమా….1st డే వచ్చింది ఇది…ఏంటి సామి ఇదీ!!

350 కోట్ల సినిమా….1st డే వచ్చింది ఇది…ఏంటి సామి ఇదీ!!

0

బాలీవుడ్ ఖిలాడీ క్షయ్ కుమార్(Akshay Kumar) టైగర్ ష్రాఫ్(Tiger Shroff) కాంబోలో భారీ అంచనాల నడుమ రంజాన్ కానుకగా రిలీజ్ అయిన భారీ బడ్జెట్ మూవీ బడే మియా చోటే మియా(Bade Miyan Chote Miyan Collections) సినిమా రీసెంట్ టైంలో భారీ హైప్ నడుమ వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….

రంజాన్ లాంటి భారీ హాలిడే వీకెండ్ లో రిలీజ్ అవ్వగా సినిమా ట్రైలర్ రిలీజ్ కి ముందు భారీ హైప్ ఇచ్చిన కూడా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అంచనాలను పెద్దగా అందుకోలేక పోయింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాకి కూడా ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అవ్వగా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా కూడా షాకిచ్చింది.

రంజాన్ పండగకి రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ సార్లు సల్మాన్ ఖాన్(Salman Khan) సినిమాలు రిలీజ్ అయ్యేవి, బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోసేవి. కానీ ఈ ఇయర్ సల్మాన్ సినిమా లేక పోవడంతో ఈ సినిమా బరిలోకి దిగగా ఏమాత్రం ఇంపాక్ట్ ను అయితే మొదటి రోజు చూపించలేదు..

మొదటి రోజు ఇండియాలో 15.7 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా 18.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ఇండియాలో అందుకుంది. ఇక ఓవర్సీస్ లో 12.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సినిమా 31.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమె అందుకుంది…

350 కోట్ల మమ్మోత్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు పండగ హాలిడే లో రిలీజ్ అయినా కూడా షాకింగ్ ఓపెనింగ్స్ ను అందుకుని అందరికీ మైండ్ బ్లాంక్ చేసింది… ఇక సినిమా వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ తో ఇప్పుడు బడ్జెట్ లో ఎంతవరకు రికవరీ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారింది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here