బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సమ్మర్ కి రిలీజ్ ను సొంతం చేసుకోవాల్సిన చాలా సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి. ఒక్క నారప్ప తప్పితే మిగిలిన సినిమాలు అన్నీ ఇంకా ఏ రూట్ కి వెళ్ళాలో అన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇలాంటి టైం లో ఇప్పుడు తిరిగి థియేటర్స్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో రీ ఓపెన్ చేసినప్పటికీ కూడా ఆంధ్రలో టికెట్ రేట్ల సమస్య ఇంకా సద్దుమణగాల్సిన అవసరం ఉండగా…
జనాలు ఎంతవరకు థియేటర్స్ కి తిరిగి వస్తారు అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇలాంటి టైం లో రిస్క్ చేసి కొన్ని చిన్న సినిమాలు డిజిటల్ రిలీజ్ లను వద్దూ అనుకుని థియేటర్స్ లో రిస్క్ చేయడానికి సిద్ధం అవుతున్నాయి. ఇప్పుడు మరో సినిమా ఈ లిస్టులో యాడ్ అయ్యింది.
తేజ సజ్జా ప్రియ ప్రకాష్ వారియర్ ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ ఇష్క్ ఇప్పుడు డిజిటల్ రిలీజ్ కి నో చెప్పి ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లోనే రిలీజ్ అవ్వడానికి సిద్ధం అయ్యి రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసేశారు. సుమారు 3.5 కోట్ల రేంజ్ బడ్జెట్ తో…
రూపొందిన ఈ సినిమా కి డిజిటల్ రిలీజ్ కోసం ఏకంగా 8 కోట్ల సెన్సేషనల్ రేటు కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చారు, ఆల్ మోస్ట్ బడ్జెట్ మీద రెండున్నర రెట్ల అధికమైన రేటు కి సైతం నో చెప్పి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాను ఈ నెల 30 న రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు మేకర్స్… దాంతో సినిమా రిలీజ్ కన్ఫాం అవ్వడం తో…
ఈ రేంజ్ రేటు కి కూడా నో చెప్పి సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తున్న మేకర్స్ ధైర్యాన్ని మెచ్చుకుని తీరాల్సిందే. అదే టైం లో జనాలు తిరిగి థియేటర్స్ కి వచ్చి సినిమాలను చూస్తారా లేదా, మేకర్స్ నిర్ణయం ఎంతవరకు సఫలం అవుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. మరి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి ఇక.