బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీకెండ్ రిలీజ్ అయిన మూవీస్ లో ఆల్ మోస్ట్ ఓన్ రిలీజ్ ను సొంతం చేసుకుని ఎలాంటి ఇబ్బంది లేకుండా రిలీజ్ అయిన సినిమా ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా. సుశాంత్ హీరోగా నటించిన ఈ సినిమా పై పెద్దగా అంచనాలు అయితే ఏమి లేవు కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా కాలంగా హిట్ కి దూరం అయిన సుశాంత్ ఈ సినిమాతో అయినా…
కంబ్యాక్ ఇచ్చి క్లీన్ హిట్ కొడతాడేమో అని అందరూ ఆశించినప్పటికీ కూడా సినిమా ఏమాత్రం ఆశాజనకంగా లేని టాక్ నే సొంతం చేసుకుంది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేక పోయిన ఈ సినిమా ఫస్ట్ డే 17 లక్షల షేర్ ని అందుకోగా…
రెండో రోజు 8 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 6 లక్షల రేంజ్ లో షేర్ ని మాత్రమె సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవరాల్ గా మొదటి వీకెండ్ ని చాలా కష్టంగా ముగించుకుంది. ఒకసారి టోటల్ ఏరియాల వారి….
మొదటి వీకెండ్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Nizam: 7L
👉Ceeded: 4L
👉UA: 5L
👉East: 4L
👉West: 2L
👉Guntur: 4L
👉Krishna: 3L
👉Nellore: 2L
AP-TG Total:- 0.31CR(0.55Cr Gross)
KA+ROI: 2L
OS: 3L~
Total Collections: 0.36CR(0.65CR~ Gross) ఇదీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో సినిమా సాధించిన కలెక్షన్స్…
సినిమాను కంప్లీట్ గా ఓన్ రిలీజ్ చేయడం తో ఎవ్వరికీ ఎలాంటి నష్టాలు ఏమి లేదు… సినిమా బడ్జెట్ 6.4 కోట్లు కాగా బడ్జెట్ మీద ఆల్ రెడీ నాన్ థియేట్రికల్ రైట్స్ తో ప్రాఫిట్ వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సినిమా హిట్ అనిపించుకోవాలంటే 2 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది కానీ సినిమా ఓవరాల్ గా ఇప్పుడు నిరాశ పరిచే కలెక్షన్స్ నే సొంతం చేసుకోబోతుంది.