Home గాసిప్స్ భీమ్లా నాయక్ OTT డీల్ క్లోజ్….కండీషన్ ఇదే!!

భీమ్లా నాయక్ OTT డీల్ క్లోజ్….కండీషన్ ఇదే!!

5823
0

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన అయ్యప్పనుం కోశియుం సినిమా తెలుగు రీమేక్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే. బాక్స్ ఆఫీస్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ వకీల్ సాబ్ సినిమా తో ఉన్న 2 వారాల్లో సంచలన కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…

ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండి ఉంటే కచ్చితంగా మరింత భారీ భీభత్సం సృష్టించి ఉండేవారు కానీ సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన అలా జరగలేదు, కానీ వచ్చే సంక్రాంతి కి పోటి ఉన్నప్పటికీ రీమేక్ సినిమా తో సంచలనం సృష్టించడానికి సిద్ధం అవుతున్నాడు పవర్ స్టార్….

ఇక సినిమా బిజినెస్ పనులు కూడా రీసెంట్ గా స్టార్ట్ అయ్యాయని తెలుస్తుంది. రీసెంట్ గా సినిమా మ్యూజిక్ రైట్స్ ను ఆదిత్యా మ్యూజిక్ వాళ్ళు రికార్డ్ రేటు కి కొన్నారని వార్తలు వస్తుండగా సినిమా పోస్ట్ రిలీజ్ తర్వాత డిజిటల్ రిలీజ్ కూడా ఆల్ మోస్ట్ కన్ఫాం అయ్యిందనే వార్తలు కూడా…

సాలిడ్ గానే చక్కర్లు కొడుతున్నాయి టాలీవుడ్ లో…. కానీ సినిమా రిలీజ్ తర్వాత ఒక కండీషన్ తో సినిమా డిజిటల్ రిలీజ్ ఉంటుందని అంటున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రిలీజ్ అయిన నెల రోజుల లోపు సినిమా డిజిటల్ లో రిలీజ్ అవ్వాలని కండీషన్ తో భారీ రేటు చెల్లించి డిజిటల్ రైట్స్ హక్కులను అమ్మారని టాక్ వినిపిస్తుంది. సినిమా డిజిటల్ రైట్స్ ను…

అమెజాన్ ప్రైమ్ వాళ్ళు సొంతం చేసుకున్నారని అంటున్నారు. ఆ రేటు ఎంతవరకు పలికింది లాంటి వివరాలు ఇంకా క్లియర్ గా రిలీజ్ అవ్వాల్సి ఉండగా ఓవరాల్ గా సినిమా థియేట్రికల్ రిలీజ్ తర్వాత 30 రోజుల లోపు డిజిటల్ లో రిలీజ్ అవ్వడం తద్యం అని అంటున్నారు… ఆ 30 రోజుల్లోనే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా దుమ్ము దుమారం చేయడం ఖాయమని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here