Home న్యూస్ పాగల్ 3 డేస్ కలెక్షన్స్….వర్కింగ్ డే లో కొట్టిందా లేదా!!

పాగల్ 3 డేస్ కలెక్షన్స్….వర్కింగ్ డే లో కొట్టిందా లేదా!!

0

యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ పాగల్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా కి మిక్సుడ్ టాక్ ఆడియన్స్ నుండి వచ్చింది, కొందరికి సినిమా బాగా నచ్చగా కొందరికీ సెకెండ్ ఆఫ్ అంతగా ఎక్కలేదు. దాంతో సినిమా కి ఒక్కొక్కరు ఒక్కోరకంగా టాక్ చెబుతూ ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం కలెక్షన్స్ పరంగా సినిమా మరీ అనుకున్న రేంజ్ లో అయితే…

కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం లేదని తెలుస్తుంది. మొదటి రోజు మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 1.3 కోట్ల రేంజ్ షేర్ ని, వరల్డ్ వైడ్ గా 1.4 కోట్ల వరకు షేర్ ని సొంతం చేసుకోగా రెండో రోజు సినిమా తెలుగు రాష్ట్రాలలో 1.25 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా…

1.3 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకుని మొత్తం మీద 2 రోజుల వీకెండ్ లో తెలుగు రాష్ట్రాలలో 2.55 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 2.7 కోట్ల షేర్ ని అందుకుంది. ఇక మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురుకున్న సినిమా 2 వ రోజు తో పోల్చితే ఆల్ మోస్ట్…

65% కి పైగా డ్రాప్స్ ను సొంతం చేసుకుని తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కొద్దివరకు గ్రోత్ ని సొంతం చేసుకుంది. మొత్తం మీద సినిమా 3 వ రోజు తెలుగు రాష్ట్రాలలో 47 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుందట. వరల్డ్ వైడ్ గా 3 వ రోజు 50 లక్షల లోపు షేర్ ని సాధించిన ఈ సినిమా ఇప్పుడు….

టోటల్ గా 3 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో 3.02 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా 3.20 కోట్ల వరకు షేర్ ని సాధించినట్లు సమాచారం. టోటల్ గ్రాస్ 5.35 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. సినిమా ట్రేడ్ లెక్కల్లో బిజినెస్ 6 కోట్ల దాకా ఉండగా 6.5 కోట్ల టార్గెట్ కి ఇంకా చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here