Home న్యూస్ మమ్ముట్టి “వన్” తెలుగు రివ్యూ…హిట్టా-ఫట్టా!

మమ్ముట్టి “వన్” తెలుగు రివ్యూ…హిట్టా-ఫట్టా!

0

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన లేటెస్ట్ మూవీస్ లో మంచి హైప్ నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాలో వన్ మూవీ ఒకటి. ముఖ్యమంత్రి రోల్ లో మమ్ముట్టి కనిపించబోతున్నారు అనగానే ఓ రేంజ్ లో అంచనాలు పెరిగి పోగా ఈ సినిమా మలయాళంలో మరీ అద్బుతాలు సృష్టించకున్నా పర్వాలేదు అనిపించుకుంది. ఈ సినిమాను తెలుగు లో ఆహా వీడియో వాళ్ళు రీసెంట్ గా రైట్స్ కొని డిజిటల్ రిలీజ్ చేశారు. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా కథ పాయింట్ కి వస్తే… సినిమా ఓపెన్ అవ్వడం ఒక కుర్రాడు తన తండ్రిని హాస్పిటల్ చేర్పించగా, అదే టైం లో CM ని కూడా ఆ ఆసుపత్రిలో చేర్చుతారు, దాంతో జెట్ సెక్యురిటీతో టోటల్ హాస్పిటల్ కంట్రోల్ లోకి తెచ్చుకుని సామాన్య జనాన్ని లోపలి రానివ్వరు…

ఒక పోలిస్ ఆ కుర్రాన్ని కొడతాడు… ఇదంతా ఒక ఫేస్ బుక్ పోస్ట్ లో పెట్టడం, విపక్షాలు ఆ పోస్ట్ ను హైలెట్ చేయడం CM అయిన హీరో ఎలా ఈ విమర్శలను సాల్వ్ చేశాడు, తర్వాత యాక్ట్ టు రీకాల్ అనే కొత్త జీవోని అమలు పరచడానికి CM ఎలా కష్టపడ్డాడు అన్నది సినిమా కథ పాయింట్.

హీరో CM అనే సరికి ఓ రేంజ్ లో అదిరిపోయే సీన్స్ ఉంటాయి అని ఆడియన్స్ ఎక్స్ పెర్ట్ చేస్తారు, కానీ హీరో ఎంట్రీ ఏకంగా 30 నిమిషాల తర్వాత ఉంటుంది, తర్వాత అయినా స్పీడ్ పెంచుతారు అనుకుంటే, మంచి చేయాలని చూసే CM, జనాలను దోచుకోవాలని చూసే MLAలు, అధికారం కోసం విపక్షాలు వాటినన్నింటినీ CM అయిన మమ్ముట్టి ఎలా ఎదిరించాడు అన్నది చూపెట్టారు.

కానీ లెంత్ మరీ ఎక్కువ అయిన ఫీలింగ్, సినిమా చాలా స్లో నరేషన్ తో తెరకెక్కడంతో బోర్ ఫీల్ అవ్వడం ఖాయం, 5 ఏళ్లకి ఒకసారి ఓట్లు వేసే ప్రజలు, తమకి నాయకులు నచ్చకపొతే మధ్యలోనే వాళ్ళని దింపేసే అధికారమే యాక్ట్ టు రీ కాల్… ఈ జీవో పాస్ చేయించాలని హీరో, పాస్ చేయించకూడదు అని మిగిలినవాళ్ళు ఎత్తులు వేస్తారు…

సినిమా కథ ఒక స్టేజ్ దాటాక మొత్తం ఈ పాయింట్ పైనే తిరుగుతుంది, పాయింట్ మంచిదే కానీ చెప్పిన విధానం బోర్ కొట్టిస్తుంది, కానీ ఇదో పాయింట్ ఒకటి ఉందని జనాలను చెప్పడం బాగుంది, మొత్తం మీద మమ్ముట్టి పెర్ఫార్మెన్స్ అద్బుతంగా ఉండటం, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుండటం సినిమా ని చివరిదాకా చూసేలా చేశాయి.

లెంత్ తగ్గించి మరింత రేసీ స్క్రీన్ ప్లే రాసుకుని ఉంటే సినిమా మరింత బాగుండేది, అలా కాకుండా స్లో నరేషన్ తో ఎలాంటి ట్విస్ట్ లు లేకుండా సింపుల్ గా సీన్ బై సీన్ ను పేర్చుకుంటూ సినిమా జస్ట్ ఓకే అనిపించుకుంది. ఖాళీ టైంలో ఏ సినిమా లేకుంటే ఈ సినిమాను ట్రై చేయోచ్చు. మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2.5 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here