ఓంకార్ డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రాజు గారి గది 3 బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ కి అతీతంగా అల్టిమేట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది, సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో వీకెండ్ మొత్తం సాలిడ్ కలెక్షన్స్ ని సాధించింది. సినిమా మూడో రోజు ఏకంగా మొదటి రోజు ని మించి వసూళ్ళ ని సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర బిజినెస్ లో చాలా మొత్తాన్ని రాబట్టింది.
మూడో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి కోటి కి పైగా షేర్ ని అందుకోవడం ఖాయం అనుకున్నా కానీ ఏకంగా అంచనాలను మించి 1.4 కోట్ల షేర్ ని అందుకుని ఏకంగా మొదటి 1.33 కోట్ల షేర్ కన్నా ఎక్కువ వసూళ్ళ ని అందుకుని దుమ్ము లేపింది.
సినిమా 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే
?Nizam: 56L
?Ceeded: 24L
?UA: 17.5L
?East: 8.8L
?West: 7L
?Guntur: 11L
?Krishna: 10L
?Nellore: 6L
AP-TG Day 3:- 1.40Cr ఇదీ సినిమా 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ సెన్సేషన్…
ఇక మూడు రోజుల వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 1.44Cr
?Ceeded: 70L
?UA: 47L
?East: 26L
?West: 19L
?Guntur: 31L
?Krishna: 26L
?Nellore: 14L
AP-TG 3 Days:- 3.77Cr
Ka & ROI: 0.23Cr
OS: 16L
Total: 4.16Cr(6.85Cr Gross) ఇదీ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ లెక్కలు…
సినిమా ను టోటల్ గా 5.2 కోట్లకు అమ్మగా సినిమా 6 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 1.84 కోట్ల షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది, మొదటి వారం ముగిసే సరికి కాని, లేక రెండో వీకెండ్ లో కానీ సినిమా బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు.